సోనియాను కలిసిన తెలుగుదేశం ఎమ్మెల్యే

హైదరాబాద్: చిరకాల, బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రిని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఎందుకు కలుస్తాడనుకుంటున్నారా! కానీ కలిశాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య నిన్న ఢిల్లీలో సోనియాగాంధిని ఆమె నివాసంలో కలిశారు. అయితే ఇదేమీ పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన వ్యవహారం కాదులెండి. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టేలా చూడమని అడగటానికి ఇతర బీసీ సంఘం నేతలతో కలిసి సోనియాను కలిశారు. అయితే ఈ నేతలలో కృష్ణయ్య తప్పితే మిగిలినవారందరూ కాంగ్రెస్‌వారు కావటం విశేషం. విద్య, ఉద్యోగరంగాలతోబాటు రాజకీయరంగంలోనూ బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించటానికి వీలుకల్పించే బీసీ బిల్లుపై పోరాటం చేస్తానని సోనియా తమకు హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. బీసీల డిమాండ్‌లగురించి ఆమె తమతో అరగంటపైగా చర్చించారని, అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారని కృష్ణయ్య వెల్లడించారు. తర్వాత ఈ బీసీనేతలందరూ సోనియాతో గ్రూప్ ఫోటో దిగారు.

తెలుగుదేశంపార్టీ కృష్ణయ్యను 2014 ఎన్నికలముందు తమ పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనను ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో నిలబెట్టింది. వాస్తవానికి తెలుగుదేశంపార్టీ ఇదంతా ఆయనేదో గెలుస్తాడనికాక నామ్‌కేవాస్తేగా చేసింది. ఎల్.బి.నగర్‌లో తాను గెలుస్తానని కృష్ణయ్యకూడా ఊహించలేదు. కానీ, ఆ నియోజకవర్గంలోని సీమాంధ్రవాసుల ప్రాబల్యంవల్ల అనూహ్యరీతిలో సుధీర్ రెడ్డిని మట్టి కరిపించి కృష్ణయ్య ఎమ్మెల్యే అయ్యారు. కానీ అసెంబ్లీలో శాసనసభాపక్షనేత పదవి ఇవ్వనందువల్లో ఏమోగానీ, పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. తాజా పరిణామాన్నిబట్టిచూస్తే అసలు ఆయన తనను తాను టీడీపీ ఎమ్మెల్యేలాగా భావించటంలేదని అనిపిస్తోంది. ఏది ఏమైనా కృష్ణయ్య తెలుగుదేశం పుణ్యమా అని, సీమాంధ్రుల పుణ్యమా అని ఎమ్మెల్యే అయ్యాడుగానీ లేకపోతే ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో నిలబడి గెలిచే సత్తా లేదనేదిమాత్రం వాస్తవం. అలాంటి తెలుగుదేశానికి కృతజ్ఞతాభావంతో ఉండకుండా ఆ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అధినేత్రిని కలిసి ఫోటోలు దిగటంమాత్రం సమంజసంగా అనిపించటంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ్ త‌రుణ్‌పై బెదిరింపు బాణం

రాజ్ త‌రుణ్ - లావ‌ణ్య వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసులో రాజ్ త‌రుణ్ అంత‌కంత‌కూ కూరుకుపోతున్నాడే త‌ప్ప‌, పైకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. తాజాగా లావ‌ణ్య రాజ్ త‌రుణ్‌కు...

ర‌వితేజ‌.. బాబీ.. మ‌రోసారి

ర‌వితేజ `ప‌వర్‌`తో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు బాబీ. ఆ త‌ర‌వాత మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా నిలిచాడు. చిరంజీవితో తీసిన 'వాల్తేరు వీర‌య్య‌' పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు నంద‌మూరి...

ప్ర‌భాస్ @ రూ.200 కోట్లు!

తెలుగు హీరో నుంచివ‌ పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా ఎదిగాడు ప్ర‌భాస్. ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్నాడు. ప్ర‌భాస్ క్యాలిబ‌ర్‌కీ, స్టామినాకీ 'క‌ల్కి' ఓ నిద‌ర్శ‌నంలా మారింది. ఈ సినిమా రూ.1000 కోట్ల...

బీజేపీలోకి హరీష్ రావు.. ఈటల హింట్?

బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్ , హరీష్ రావుల ఇటీవలి ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కవితకు బెయిల్ కోసమే ఈ ఇద్దరూ ఢిల్లీ వెళ్ళారని, అదే సమయంలో రాష్ట్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close