జయమ్మకు, రామన్నకు, బాబులకు కాదు….అధికారానికి బానిసలు..అంతే

అన్నాడిఎంకె పార్టీ నాయకులందరూ కూడా జయలలితకు సాష్టాంగ నమస్కారాలు చేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసేవాళ్ళు. ఆమె కాళ్ళు కనిపించడం ఆలస్యం…టపీ టపీమని ఆమె కాళ్ళమీదపడిపోయేవాళ్ళు. జయలలితకు ఆంజనేయుడులాంటి వాడు అని పేరెన్నికగన్న పన్నీరు శెల్వంతో సహా అందరూ అదే బాపతు. ఈ నాయకులందరికీ అమ్మపైన ఎంతటి భయభక్తులున్నాయో కదా అని చెప్పి మీడియావాళ్ళు కూడా తెగరాసేసేవాళ్ళు. మరి అదే అమ్మ చావుబ్రతుకుల మధ్య ఉంటే ఈ రాజకీయ భక్తులందరూ ఏం చేశారు? జయలలిత చనిపోవడం ఖాయం అని తెలిసినవెంటనే…..ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అపోలో డాక్టర్స్‌ని ఎంక్వైరీ చేసి మరీ జయలలిత పరిస్థితి గురించి తెలుసుకుని ఎవరి రాజకీయం వాళ్ళు చేశారు. జయ ప్రథమ భక్తుడు తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు. జయలలిత నెచ్చెలి పార్టీని చేతుల్లోకి తీసుకుంది. ఆల్ హ్యాపీస్. ఇక కెమేరాల ముందు ఎవరి నటనా సామర్థ్యం మేరకు వాళ్ళు అత్యద్భుతంగా సెంటిమెంట్‌ని పండించేశారు. ఒకానొక సినిమా నటుడైన కొత్త ఎమ్మెల్యే మాత్రం అసలు రంగు బయటపెట్టేసుకున్నాడు. తన సినీ అభిమాని సెల్ఫీ అడిగేసరికి….మనవాడు అత్యుత్సాహపడిపోయి ఆనందంగా నవ్వుతూ ఫోజు ఇచ్చి మరీ జయ సమాధి దగ్గర ఫొటోలు దిగాడు. ఆ కొత్త ఎమ్మెల్యే ఒక్కడిని పక్కనపెడితే మిగతా అందరూ కూడా జీవించేశారు. ఇప్పుడు అదే నాయకులందరూ శశికళ కాళ్ళకు కూడా అదే రేంజ్‌లో నమస్కారాలు చేస్తున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో దండాలు పెడుతున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్న కొంతమంది ప్రజలు మాత్రం షాక్ అవుతున్నారు.

ఇప్పుడు తమిళ తంబీలు ఈ అగ్రశ్రేణి నటనాయకుల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు కానీ మన తెలుగు వాళ్ళకు మాత్రం అది కొత్త విషయమేం కాదు. అది కూడా ఎన్టీఆర్ కాలంనాటి రాజకీయాలపైన అవగాహన ఉన్నవాళ్ళకు అస్సలు ఆశ్ఛర్యం అనిపించదు. ఇప్పుడు అగ్రశ్రేణి నాయకుడైన యనమల రామకృష్ణుడుతో సహా చాలా మంది నాయకులు 1983 ఎన్నికలలో పోటీచేసినప్పుడు అడ్రస్ లేనివాళ్ళే. మంత్రులుగా ప్రమాణం చేయడానికని చెప్పి ఎన్టీఆర్, గవర్నర్‌ల దగ్గరకు వెళ్ళాలనుకున్న ఈ నాయకులను బయట ఉండే సెక్యూరిటీ వాళ్ళు లోపలకు వెళ్ళనివ్వలేదు. అందరు సామాన్య ప్రజల్లాగా వీళ్ళు కూడా ఎన్టీఆర్ చూడడానికి వచ్చిన బాపతు జనాలనుకున్న సెక్యూరిటీ వాళ్ళు ఆ ఎమ్యెల్యేలను లోపలకు వెళ్ళనివ్వలేదు. అది ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ టిడిపి నాయకుల స్థాయి. టిడిపి పార్టీ ఎన్టీఆర్ చేతుల్లో ఉన్నన్ని రోజులూ కూడా ఎన్టీఆర్ పేరు చెప్తేనే భయంతో పాటు భక్తి పారవశ్యంలో మునిగిన నేతలే అందరూనూ. కానీ ఒకసారి అన్నగారి చేతుల్లో నుంచి పార్టీ, పదవి రెండూ పోయాక, పోతుందని తెలిశాక మాత్రం ఆయనకు సపోర్ట్‌గా నిలబడినవాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఎన్టీఆర్ కంటే నాకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. నేనే ముఖ్యమంత్రిని అవబోతున్నాను అని చంద్రబాబు చెప్పగానే ఎన్టీఆర్‌కి హ్యాండ్ ఇచ్చేశారు. ముక్కూమొహం తెలియని వాళ్ళను చేరదీసి తన కష్టంతో మంత్రులను చేశాడు ఎన్టీఆర్. 1994నాటికే బాగా ఆస్తులు కూడా సంపాదించుకున్న, పదవులు కూడా అనుభవించి ఉన్నవాళ్ళు రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి అయినా ఎన్టీఆర్ వైపు నిలబడి ఉండవచ్చు. మామూలు మనుషులు అయి ఉంటే అలానే చేసి ఉండేవాళ్ళు కూడా. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు కదా. చంద్రబాబునాయుడితో సహా ఇప్పుడున్న టిడిపి నాయకులందరి రాజకీయ జీవితాలు కూడా ఎన్టీఆర్ పెట్టిన భిక్ష. కానీ వాళ్ళు మాత్రం టైం చూసి పెద్దాయన్ని దెబ్బకొట్టారు. ఎన్టీఆర్ పైన చెప్పులేశారు. ఇదే యనమల రామకృష్ణుడు అయితే ఎన్టీఆర్‌కి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఎన్టీఆర్‌కి విలువలు లేవు అని విమర్శలు చేశాడు.

ఎన్టీఆర్, జయలలితలు అనే కాదు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అయినా, చంద్రబాబునాయుడు అయినా అద్వానీ అయినా లేక వేరే ఏ నాయకుడైనా సరే పదవిలో ఉన్నంత కాలం నాయకుల స్వార్థానికి వాళ్ళు ఉపయోగపడుతున్నంత కాలం ఈ భక్త నాయకులందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు పాదాభివందనాలు చేస్తూ ఉంటారు. ఒకసారి నాయకుల పరిస్థితి తారుమారైనా…లేక ఆ నాయకుడికంటే ఎక్కువగా స్వలాభాలాను చేకూర్చే వేరే నాయకుడు ఎవరైనా దొరికినా క్షణాల్లో జీవితాన్నిచ్చిన నాయకుడిని కూడా వదిలేయగల సమర్థులు మన నాయకులు. మామూలు మనుషులకు ఉండే మానవత్వ విలువలేవీ మన నాయకులకు ఉండవు…స్వార్థం తప్ప. ఆ స్వార్థానికి ‘పెజా సేవ అంటే కసి’ అన్న ముసుగేసి ప్రజల ముందు నవరస నటనా సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close