కశ్మీర్‌లో కొత్త కుంపటి 35-ఏ…! మరోసారి టెన్షన్ ..టెన్షన్ ..!

జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న వివాదాస్పద ఆర్టికల్ 35-ఏ ఆ రాష్ట్రాన్ని ఉద్రిక్త పరిస్థితుల్లో మరోసారి నెట్టింది. ఈ అధికరణను తొలిగించాలంటూ సంఘ్‌పరివార్‌కు చెందిన “వి ద సిటిజన్స్” సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఆర్టికల్ 35-ఏను తొలగిస్తారంటూ కశ్మీర్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ, వేర్పాటువాద సంస్థలు రెండు రోజులుగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఆర్టికల్‌ను తొలిగిస్తే ఊరుకునేది లేదని, కశ్మీర్ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తామని వేర్పాటువాద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కేంద్రం తీరును రెండురోజుల నుంచి బంద్‌ పాటిస్తున్నారు.

ఆర్టికల్ 35-ఏను కొనసాగించాల్సిందేనని కశ్మీర్‌లోని రెండు ప్రధాన పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ డిమాండ్ చేస్తున్నాయి. రెండు పార్టీలు వేర్వేరుగా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఆర్టికల్ 35-ఏ కశ్మీర్ ప్రజల హక్కు అని, దాన్ని తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ లేకుంటే భారత్‌తో జమ్ముకశ్మీర్‌కు సంబంధం ఏమిటనేది ఆయా పార్టీల వాదన. మరో వైపు బీజేపీ మాత్రం ఆర్టికల్ 35-ఏను తొలగించాలన్నదే తమ విధానమంటోంది. కశ్మీర్ అభివృద్ధికి ఈ ఆర్టికల్ అడ్డంకిగా మారిందని బీజేపీ చెబుతోంది. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ఆర్టికల్ 35-ఏను భారత రాజ్యాంగంలో చేర్చారు. దీని ద్వారా జమ్ముకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, అధికారాలు సంక్రమించాయి. బయటి వ్యక్తుల రాకను ఈ ఆర్టికల్ అరికడుతుంది. ఇతర రాష్ర్టాల పౌరులు కశ్మీర్‌లో ఆస్తులు కొనరాదు. స్థిర నివాసం ఏర్పరుచుకోకూడదు. పరిశ్రమలు, సంస్థలు స్థాపించకూడదు.

ఇవాళ జరగనున్న విచారణను.. వాయిదా వేయాలని… గవర్నర్ ..సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ప్రస్తుతం కశ్మీర్ గవర్నర్ పాలనలో ఉంది. త్వరలో పంచాయితీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ కారమంగా వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం విన్నవించింది. విచారణ జరుగుతుందా..? జరిగితే.. 35-ఏ రద్దు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఊహించడం కష్టమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close