హై టెన్షన్: జై బాలయ్య.. జై జగన్

హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలకృష్ణ ఇంటిని వైసీపీ కార్యకర్తలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. పట్టన సమీపంలో డంపింగ్‌ యార్డ్‌ తరలించే విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో స్థానిక టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఈ విషయంలో టీడీపీ నేత సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఆగ్రహించిన అధికార పార్టీ కార్యకర్తలు, నేతలు బాలకృష్ణ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వైసీపీ నాయకులని నివారించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు ‘జై బాలయ్య’ అని నినాదాలు చేస్తే వైసీపీ నాయకులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు శ్రమించాల్సివచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : మద్యనిషేధం చేసే ఓట్లడుగుతామన్నారే !

జగన్మోహన్ రెడ్డి తనకు మనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెబుతారు. 99.8 శాతం అమలు చేశానని విచిత్రమన లెక్కలు ప్రకటిస్తూంటారు. కానీ మేనిఫెస్టోను చూస్తే అందులో ఒక్కటంటే ఒక్కటీ...

తెలుగు రాష్ట్రాల్లో నామినేష‌న్లు షురూ…

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి మ‌రింత ప‌దునెక్క‌నుంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ గురువారం నుండి మొద‌ల‌వుతుండ‌టం, మంచి రోజు కావ‌టంతో మొద‌టి రోజే నామినేష‌న్లు భారీగా దాఖ‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీకి, లోక్...

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు…

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ల్యాండ్ క‌బ్జా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జ‌న్యాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసు అధికారుల‌తో క‌లిసి...

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close