రాజధానిగా కర్నూలును రెడీ చేస్తున్న టీజీ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనిశ్చిత వైఖరితో.. జిల్లాల్లో కూడా…. హైకోర్టు కోసం ఉద్యమాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో… ఎంపీ టీజీ వెంకటేష్.. కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్‌తో జోరుగా ముందుకు వెళ్తున్నారు. రాయలసీమ వాదాన్ని ఇంకా చెప్పాలంటే.. కర్నూలు వాదాన్ని ఎక్కువగా వినిపించే నేతల్లో టీజీ వెంకటేష్ ముందుంటారు. ప్రభుత్వం తీరు ఇప్పుడు ఆయనకు బాగా కలసి వస్తోంది. అందుకే.. హైకోర్టు ఎలాగూ వస్తుందని చెబుతున్నారు కాబట్టి.. రాజధానిని కూడా కర్నూలులోనే పెట్టేస్తే బాగుంటుందని సలహాలిచ్చేస్తున్నారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తే ఖర్చు లేకుండా అభివృద్ధి జరుగుతుందని.. ప్రణాళికలు వేస్తున్నారు. రాజధానికి అవసరమైన భవనాలు కర్నూలులో చాలా ఉన్నాయని.. గుర్తు చేస్తున్నారు.

కర్నూలులో రాజధాని ఏర్పాటు అంటే రాష్ట్రాన్ని విడగొట్టడం కాదని.. టీజీ వెంకటేష్ విశ్లేషిస్తున్నారు. అమరావతిని ఫ్రీజోన్ చేయాలని ఎన్ని సార్లు చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు రాయలసీమను పట్టించుకోలేదని తీర్పిచ్చేశారు టీజీ వెంకటేష్‌. అయితే ఆ అయిదేళ్లు ఆయన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలోనే పని చేశారు. ఎంపీగా.. కూడా పని చేశారు., ఇప్పుడు.. ఆ టీడీపీ ఇచ్చిన ఎంపీ పదవితోనే ఉన్నారు. అప్పుడు ఆయనకు.. రాయలసీమను టీడీపీ, ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తుకు వచ్చినట్లుగా లేదన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.

ఉమ్మడి మద్రాస్‌ నుంచి విడిపోయిన తర్వాత సమైక్యాంధ్రా రాజధానిగా మొదట కర్నూలును నిర్ణయించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ విషయాన్ని … టీజీ వెంకటేష్ పదే పదే గుర్తు చేస్తూ.. కర్నూలు సెంటిమెంట్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ఇప్పుడు.. రాయలసీమవాదం వినిపిస్తున్న సమయంలో… టీజీ కి ప్రత్యేకంగా.. హైకమాండ్ నుంచి పర్మిషన్లు కూడా అవసరం లేకపోయింది. అందుకే..కర్నూలు వాదం… ఓ రేంజ్‌లో వినిపిస్తున్నారు. ఇది ఎలాంటి మలుపులు తిరగబోతోందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close