అఖిల్ తో స్టెప్పు వేసిన త‌మ‌న్‌

త‌మ‌న్ ఓ సంగీత ద‌ర్శ‌కుడు. గాయ‌కుడు. అంత‌కు ముందే.. న‌టుడు. శంక‌ర్ తీసిన బోయ్స్‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు త‌మ‌న్. ఆ త‌ర‌వాత సంగీత ద‌ర్శ‌క‌త్వంతో బిజీ అయిపోయాడు. మ‌ళ్లీ మేక‌ప్ వేసుకునే ఆలోచ‌న చేయ‌లేదు. ఇప్పుడు మాత్రం అఖిల్ తో క‌ల‌సి స్టెప్పులు వేశాడు. అఖిల్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన చిత్రం ‘మిస్ట‌ర్ మ‌జ్ను’. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించాడు. అంతేకాదు… ఓ పాట‌లో మెరిశాడు. `కోపంగా కోపంగా` అనే పాట‌లో త‌మ‌న్ క‌నిపించాడు. స‌ర‌ద‌గా స్టెప్పేశాడు. ”ఇది అనుకోకుండా జ‌రిగింది. ఫ‌స్ట్ క్లాస్ టికెట్ వేస్తాను.. నువ్వు రావాల్సిందే. అని న‌న్ను ఫారెన్ పిలిపించుకున్నాడు. స‌ర‌దాగా అఖిల్ తో స్టెప్పు వేయించాడు. నాతో అలాంటి స్టెప్పులేయించ‌డానికి డాన్స్ మాస్ట‌ర్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు” అని చెప్పుకొచ్చాడు త‌మ‌న్‌. ఈ సినిమాలో ఆరు పాట‌లున్నాయి. ఆరూ.. ఆరు ర‌కాలుగా సాగాయి. త‌మ‌న్‌లోని మెలో్డీ ప‌వ‌ర్ మ‌రోసారి చూపించాయి. ఇక డాన్సింగ్ టాలెంట్ ఏమిటో తెర‌పైనే చూడాలి. ఈనెల 25న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close