హ్యాట్సాఫ్ భరద్వాజ…రామోజీని టార్గెట్ చేసిన హీరో మీరు

ముఖ్యమంత్రులనే తన ఇంటికి రప్పించుకునేంత స్థాయి రామోజీది. లక్ష నాగళ్ళతో దున్నిస్తా అన్న వాళ్ళచేతనే వందల ఎకరాల భూములను తనకు కట్టబెట్టేలా చేసుకోగల నైపుణ్యం రామోజీరావు సొంతం. వైఎస్‌లు అసలు మనుషులే కాదు…రాక్షసులు అనే స్థాయి వార్తలు రాసినప్పటికీ జగన్‌ని తన ఇంటికి రప్పించుకోగల సత్తా రామోజీ సొంతం. ఇక గత కొన్నాళ్ళుగా రిలయన్స్ కోసం రామోజీ చేసి పెడుతున్న ప్రచారం అసామాన్యం. అలాగే ప్రత్యేక హోదాతో సహా అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ జనాలను వంచించిన నరేంద్రమోడీపైన ఎపి జనాల్లో ఎక్కడా వ్యతిరేకత రాకుండా ఉండేలా రామోజీ చేస్తున్న నమో భజన అపురూపం. ప్రధానమంత్రి నుంచీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ దేశంలో ఉన్న ఏ ఒక్కరికీ సాధ్యం కాని స్థాయిలో పలుకుబడి ఉన్న రామోజీరావును డైరెక్ట్‌గా విమర్శించాలంటే ఎంత ధైర్యం కావాలి? అది కూడా సినిమా వాళ్ళ నుంచి అయితే ఆ స్థాయి ధైర్యాన్ని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేం.

ప్రత్యేక హోదా పోరాటం విషయంలో కూడా యువతకు సపోర్ట్‌గా నిలబడడానికి ముందుకొచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ ఆ ధైర్యం చేశాడు. జబర్ధస్తీగా ప్రతి తెలుగు లోగిలిలోనూ బూతులు వినిపిస్తున్న రామోజీ మీడియాను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. డబ్బుల కోసం, రేటింగ్స్ కోసం రామోజీ స్థాయి వ్యక్తి దిగజారడాన్ని ఆక్షేపించాడు. డబ్బుతో పాటు గొప్ప పేరును కూడా సంపాదించుకున్న రామోజీరావు…అదే డబ్బు కోసం పేరును చెడగొట్టుకుంటూ ఉండడాన్ని ఆయనపైన అభిమానం చూపిస్తూనే విమర్శించాడు. వేరే ఏ ఛానల్‌లోనూ ఉండనంత దారుణంగా ఈటీవీలో వినిపిస్తున్న బూతులను నియంత్రించడం గురించి రామోజీరావు ఆలోచించాలని చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యవహారం గురించి కూడా చెప్పుకోవాలి. సినిమానటిగా అయితే జబర్ధస్త్ అన్నా, ఇంకో కార్యక్రమం అన్నా ఆమెకు సరిపోతుందేమో కానీ ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రతిరోజూ తెలుగు వాళ్ళందరికీ బూతులు వినిపించే కార్యక్రమంలో భాగమవ్వడం మాత్రం రోజా స్థాయిని తగ్గించే విషయమే. డబ్బు కోసం కక్కుర్తిపడి బూతు జపం చేస్తూ ఉండడంపైన ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. ఎన్నో విషయాల్లో ఈటీవీ వారి నంబర్ ఒన్ హోదా గురించి ఎంతో మంది గొప్పగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ కూడా బూతుల్లో ఈటీవీ సాధించిన నంబర్ ఒన్ ర్యాంక్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా మేలుకుంటారో…….లేక నిద్ర నటిస్తానో…….లేక ఎదురు దాడి చేస్తూ సమర్థించుకుంటూనో…ఇంకా దిగుజారుతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com