టివి ఛానెళ్ళ పై విరుచుకుపడ్డ తమ్మారెడ్డి భరద్వాజ

కత్తి మహేష్ – పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. కాదు, కాదు, అది సమసిపోకుండా ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూ సమస్యని కొన”సాగేలా” చేస్తున్నాయి టివి ఛానెల్స్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టివి ఛానెళ్ళు కత్తి మహేష్ కోట్లాది రూపాయలు రుణపడ్డాయనే కొత్త లాజిక్ ని బయటికి తీస్తూ ఛానెళ్ళపై విరుచుకుపడ్డారు తమ్మారెడ్డి. ఛానెళ్ళ పేర్లు ప్రస్తావించకపోయినా, “మెరుగైన సమాజం ఛానెల్”, “దమ్మున్న ఛానెల్” అన్న పదాలు ప్రస్తావించి టివి9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ని తాను టార్గెట్ చేసినట్టు జనాలకి అర్థమయేలా చేసారు. వివరాల్లోకి వెళ్తే..

ఈ మధ్య, “నిర్భయ” ఘటన ని మించిన సంఘటన హర్యానాలో జరిగిందనీ, అలాగే న్యాయ వ్యవస్థ లో సంక్షోభం ఏర్పడిందా అనే స్థాయి లో జడ్జీల నిరసన కార్యక్రమం ఒకటి జరిగిందనీ, అలాగే చాలా నెలల తర్వాత మోడీ ని చంద్రబాబు కలిసారనీ, ఈ కలయిక లో ఏం జరిగిందో చూచాయగా అర్థమైతే, రాష్ట్ర భవిష్యత్తు కి ఏం ఒరుగుతుందో కూడా కాస్త విశ్లేషించవచ్చనీ – ఇన్ని వార్తలు దేశం లో జరిగాయి కాబట్టి వాటి మీద మరింత సమాచారం కోసం, మరింత విశ్లేషణ కోసం టివి పెడితే, “మెరుగైన సమాజం కోసం” పని చేసే ఛానెల్ కానీ, దమ్మున్న ఛానెల్ కానీ వీటిలో ఏ ఒక్క న్యూస్ కీ ప్రాధాన్యత ఇవ్వకుండా, కత్తి మహేష్ తో గంటల తరబడి చర్చలు చూపిస్తున్నారనీ విరుచుకుపడ్డారు. ప్రధానమైన వార్తలని ప్రక్కనపెట్టి సమాజానికి ఏ విధంగానూ పనికి రాని ఒక సమస్య మీద గంటల తరబడి సమయాన్ని కొద్ది నెలలపాటుగా వెచ్చిస్తున్నారనీ, ఇది సమాజానికి మంచిది కాదనీ వ్యాఖ్యానించారు. దేశం లొ కత్తి మహేష్ తప్ప వేరే ఏ సమస్యలు లేవని ప్రజలని మీరు మభ్యపెడుతున్నారా అని తీవ్రంగా ప్రశ్నించారు. దీంతో పాటు ఈ ఛానెళ్ళలో మొత్తం సిబ్బంది అంతటికీ కలిపి జీతాల రూపం లో దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. అంతంత జీతాలు చెల్లిస్తున్న ఛానెళ్ళు కత్తి మహేష్ పేరిట టీఆర్పీ లు తెచ్చుకోవడం దురదృష్టం. ఇన్నేసి ఛానెళ్ళు నాలుగు నెలలుగా ఈ తంతు కొనసాగిస్తూ, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాయనీ, కానీ అందులోనుంచి చిల్లి గవ్వ కూడా కత్తి మహేష్ కి ఇవ్వడం లేదని, కనీసం ఆ కారణం తోనైనా కత్తి మహేష్ ఇక ఉదయం 6 గంటల నుంచీ రాత్రి 11 దాకా స్టూడియోల చుట్టూ తిరగడం మానేయాలని తాను సూచిస్తున్నానని చెప్పారు.

ఏది ఏమైనా టివి ఛానెల్స్ మీద ఈ స్థాయి లో సోషల్ మీడియా కేంద్రంగా తమ్మారెడ్డి విరుచుకుపడటం ఆశ్చర్యం. అయితే సామాన్యుల్లో ఈ అంశం లో టివి ఛానెల్స్ మీద ఉన్న అభిప్రాయాన్నే ఆయన కూడా చెప్పడం తో ప్రజల నుంచి స్పందన కూడా ఈ వీడియోకి అద్భుతంగా వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close