సింగీతం ప‌ప్ప‌న్నం – ల‌క్ష్మ‌ణ్ బ్యాటింగ్‌

యువ ద‌ర్శ‌కుల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్‌. పెళ్లి చూపులు ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ న‌గ‌రానికి ఏమైంది కూడా నిర్మాత‌కు లాభాలు తెచ్చే సినిమానే. మూడో సినిమా కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లోనే తీస్తున్నాడు. ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకున్నాడు త‌రుణ్‌. పెళ్లి చూపులు సినిమా చూసి… దర్శ‌క దిగ్గ‌జం సింగీతం శ్రీ‌నివాస‌రావు.. త‌రుణ్ భాస్క‌ర్‌ని ఇంటికి పిలిచి.. భోజ‌నం పెట్టార‌ట‌. ప‌ప్ప‌న్నం, నెయ్యి, అప్ప‌డంతో సాగిన ఆ భోజ‌నం త‌న‌కెప్పుడూ గుర్తుంటుంద‌ని చెప్పుకొచ్చాడు. త‌రుణ్‌లో ఓ మంచి క్రికెట‌ర్ ఉన్నాడు. ల‌క్ష్మ‌ణ్ ఉండే అపార్ట్మెంట్‌లోనే త‌రుణ్ భాస్క‌ర్ వాళ్లు కూడా ఉండేవార్ట‌. ల‌క్ష్మ‌ణ్ నెట్ ప్రాక్టీస్ చేస్తుంటే.. త‌రుణ్ బౌలింగ్ వేసేవాడ‌ట‌. త‌నెంత చెత్త‌గా బంతులు వేసినా – ల‌క్ష్మ‌ణ్ ఓపిగ్గా బ్యాటింగ్ చేసేవాడ‌ని చెప్పుకొచ్చాడు త‌రుణ్‌. పెళ్లి చూపులు విడుద‌ల కాక‌మునుపు కొంత‌మంది బ‌య్య‌ర్ల‌కు చూపిస్తే.. ‘ఇదేం సినిమా.. నీకు డ‌బ్బులుంటే వేరేలా ఖ‌ర్చు పెట్టుకో… ఇలాంటి సినిమాలు తీయ‌కు` అన్నార్ట‌. ఒకాయ‌నైతే ‘ఇందులో స్కిన్ షో ఉందా?’ అని ప్ర‌శ్నించాడ‌ట‌. అవ‌న్నీ త‌న‌కు బాగా ఇబ్బంది పెట్టాయ‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close