వెంకీ సినిమా… సెకండాఫ్ స‌మ‌స్య‌

పెళ్లి చూపులు సినిమాతో సూప‌ర్ స‌క్సెస్ కొట్టాడు త‌రుణ్ భాస్క‌ర్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి ఓ స్టార్ ఈ సినిమాతోనే వెలుగులోకి వ‌చ్చాడు. ద‌ర్శ‌కుడిగా త‌రుణ్‌కీ మంచి అవ‌కాశాలొచ్చాయి. ఈ న‌గ‌రానికి ఏమైంది ఫ్లాప్ అయినా – త‌రుణ్ ఛాన్సుల‌కు కొద‌వ లేకుండా పోయింది. ఇప్పుడు వెంక‌టేష్ తో ఓ సినిమా ఫిక్స‌య్యింది. ఈ సినిమానీ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌నే నిర్మిస్తోంది. నిజానికి ఎప్పుడో కొబ్బ‌రికాయ కొట్టుకోవాల్సిన సినిమా ఇది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. దానికి కార‌ణం సెకండాఫ్ ఇంకా సెట్ కాక‌పోవ‌డ‌మే అని తెలిసింది. ఇది వ‌ర‌కే.. వెంకీ, సురేష్‌బాబుల‌కు లైన్ వినిపించి ఓకే చేయించుకున్నాడు త‌రుణ్‌. అయితే స్క్రిప్టుగా మార్చే ప‌నులు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని తెలుస్తోంది. ద్వితీయార్థం ఇంకా తేల‌డం లేదని, ఎన్ని వెర్ష‌న్లు చెప్పినా సురేష్ బాబు ఓకే చేయ‌డం లేద‌ని టాక్‌. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే వెంకీ మామ త‌ర‌వాత త‌రుణ్ భాస్క‌ర్ సినిమానే ప‌ట్టాలెక్కాలి. కానీ త‌రుణ్ మాత్రం క‌థ‌ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయ‌డంలో విఫ‌లం అవుతున్నాడు. మ‌రి.. వెంకీ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close