మహేష్ ని అసలు అడగలేదు – గుణశేఖర్

రిలీజ్ అవ్వడానికి దగ్గర పడుతున్నా కొద్ది రుద్రమదేవి గురించి రహస్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఆకట్టుకునే యుద్ధ సన్నివేశాలు ఆడియెన్స్ ని అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఉన్నాయని అవి తప్పకుండా ఆడియెన్స్ కు నచ్చుతాయని ఊరిస్తున్నారు. ఊపందుకున్న ప్రమోషన్స్ లో అనుష్క, రానా, అల్లు అర్జున్ తమ తమ పరిధి మేరకు సహకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం గుణశేఖర్ మాట్లాడిన మాటలే పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి.

సినిమా అంతా రాసుకున్న గుణశేఖర్ గోనగన్నా రెడ్డి పాత్రకు స్టార్ హీరో అయితే బాగుంటాడని అనుకున్నాడట. అందుకున్నదే ఆలస్యం పౌరాణికంగా కాస్త చూడటానికి బాగుండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అడిగాడట. అయితే కథ విన్న ఎన్టీఆర్ గోనగన్నారెడ్డి పాత్రే హైలెట్ చేస్తే చేస్తా అన్నాడని నిక్కచ్చిగా చెప్పేశాడు గుణశేఖర్. ఇక అదేకోవలో మహేష్ బాబుని కూడా గోన గన్నారెడ్డి క్యారక్టర్ కి అడిగారట కదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను అసలు మహేష్ ని అప్రోచ్ అవ్వలేదని అన్నాడు.

అప్పట్లో మహేష్ గుణా అడిగినట్టు మహేష్ తనకు ఆ పాత్ర సూటవ్వదని చెప్పినట్టు ఏవో ఊహాగానాలు వచ్చాయి. కాని అవన్ని రూమర్లను కొట్టిపారేశాడు గుణశేఖర్. అక్టోబర్ 9 న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే ఆడియెన్స్ లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. మరి చూస్తుంటే రుద్రమదేవి కూడా సూపర్ హిట్ కొట్టేలా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close