రూ.20 కోట్లిచ్చి విమానాలు నడిపిస్తున్న ఏపీ ప్రభుత్వం !

జిల్లాకో ఎయిర్ పోర్టు పెట్టాలని సీఎం జగన్ డిసైడయ్యారు. వాటికిఎంత ఖర్చు పెడతారో తెలియదు కానీ.. ఉన్న ఎయిర్ పోర్టులకు విమానాలు తిరగాలంటే.. ఒక్క విమానయాన సంస్థకు ఏటా రూ. ఇరవై కోట్లు చెల్లించక తప్పడం లేదు. విమానాలు తిరగకపోతూండటంతో ప్రభుత్వం ఎలాగైనా వాటిని ఆపరేషన్‌లో ఉంచాలని ప్రయత్నిస్తోంది. అందు కోసం… ఎదురు డబ్బులు పెట్టి విమానాలు తిరిగేలా ఇండిగో సంస్థతో ఒప్పందం చేసుకుంటోంది. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో క‌డ‌ప‌, క‌ర్నూలు విమానాశ్రయాలు ప్రారంభమయ్యాయి. కడప నుంచి టీడీపీ హయాంలో.. కర్నూలు నుంచి వైసీపీ హయాంలో కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కానీ సర్వైవ్ కాలేకపోయాయి. స‌రిప‌డినంత ట్రాఫిక్ లేకపోవడంతో స‌ర్వీసులు న‌డిపేందుకు ఎయిర్ లైన్స్ ఆస‌క్తిచూప‌టం లేదు. ప్రారంభించినవి కూడా ఆపేశాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు వీలుగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇండిగో ఎయిర్ లైన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఏటా 20 కోట్ల రూపాయ‌లు చెల్లించ‌నుంది.

విజయవాడకు అంతర్జాతీయ విమానాశ్రయం హోదా వచ్చినా.. ఒక్క విమానం కూడా అలాంటి సర్వీసు లేదని గత ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో ఓ విమానానికి అనుమతి ఇచ్చింది. సింగపూర్‌కు అప్ అండ్ డౌన్ ఆ విమానం తిరిగేది. అయితే విమానం తిరిగినంత కాలం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఏపీ ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కట్టాల్సిన అవసరం రాలేదు. అంత సక్సెస్‌ అయిది ఆ సర్వీస్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటిలాగే ఆ సర్వీసు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు దేశీయ విమానాలు నడపడటానికే ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ .. అది కూడా రూ. 20 కోట్ల ఫిక్స్‌డ్ అమౌంట్ కట్టడానికి రెడీ అయిపోవడం.. రివర్సే మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close