జగన్‌ లేఖ ఎఫెక్ట్.. ప్రైవేటు ఆస్పత్రులకు టీకాల కోత..!

సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన వెంటనే కేంద్రం.. ప్రైవేటు ఆస్పత్రులకు టీకాల పంపిణీ విషయంలో మార్పులు చేసింది. సీఎం జగన్ డిమాండ్లను యధాతథంగా అమలు చేయకపోయినప్పటికీ.. టీకా విధానంలో మాత్రం స్పష్టమైన మార్పులు చేసింది. టీకాలన్నింటినీ ఆస్పత్రులు వాడటం లేదని.. వాటిని ప్రభుత్వానికి ఇప్పించాలని.. అసలు ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలు ప్రభుత్వం ద్వారా వెళ్లాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖలో సూచించారు. దీనికి తగ్గట్లుగా కేంద్రం కొన్ని చర్యలు ప్రకటించింది. టీకాలను ఆస్పత్రులు నేరుగా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేయడాన్ని నిషేధించింది.

టీకాల కోసం ప్రైవేటు ఆస్పత్రులు కొవిన్‌ ద్వారా మాత్రమే ఆర్డర్లు పెట్టుకోవాలని ఆదేశించింది. ఎన్ని పడితే అన్ని కొనడానికి చాన్స్ లేదు. గత నెల సగటు వినియోగానికి రెట్టింపు డోసులు మాత్రమే తర్వాతి నెలకు ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ప్రధాని మోడీ ప్రకటించిన వ్యాక్సిన్ విధానం ప్రకారం.. వ్యాక్సిన్‌ తయారీ సంస్థల నుంచి 75శాతం డోసులను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. మిగతా 25 శాతం డోసులను ఉత్పత్తిదారులు నేరుగా ప్రైవేట్లో విక్రయించుకోవచ్చు. ప్రభుత్వమే విరివిగా టీకాలు ఇస్తూండటంతో ప్రైవేటు రంగంలో టీకాలు వేయించుకునేవారు తక్కువగా ఉన్నారు.

దీంతో వారి దగ్గర టీకాలు మిగిలిపోతున్నాయి. ప్రవేటు ఆసుపత్రులకు 25శాతం టీకాలను కేటాయించడం చాలా ఎక్కువ అని, దాన్ని తగ్గించాలంటూ తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఇటీవల కేంద్రానికి లేఖ రాశాయి. కేంద్ర కేబినెట్ కార్యదర్శితో జరిగిన సమావేశంలోనూ ఇవే అభిప్రాయాన్ని చెప్పి.. చివరికి కేంద్రం నిర్ణయం ప్రకటించే ఒక్క రోజు ముందు సీఎం జగన్ కూడా కేంద్రానికి లేఖ రాశారు. క్రెడిట్‌ను ఆయన ఖాతాలో కూడా వేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close