స్టార్‌ మా’లో లేడీ వారియర్‌ రుద్రమదేవి!!

ఒక మహిళ ఆత్మవిశ్వాసం ఎంత బలమైనదో, ఒక రాజ్యాన్ని పాలించే కష్టమైన బాధ్యతని కూడా ఎంత గొప్పుగా చేసి చూపించగలదో నిరూపించిన అపురూపగాధ “రుద్రమదేవి? కాకతీయ స్వామ్రాజ్య గాధని తల్చుకుంటేనే గుండెలు ఉప్పొంగే ఈ నేలపై ప్రతి ఒక్కరికి ఆ స్పూర్తిగాధ స్టైయిట్‌ తెలుగు సీరియల్‌గా తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఓ విజువల్‌ వండర్‌లా రూపుదిద్దుకుంది.

రుద్రమదేవి చరిత్ర ని కేవలం ఒక కథ కాదు. ఒక వీరగాధ. కేవలం ఒక పాఠ్యాంశం కాదు..తరతరాల స్పూర్తి గాధ. అది ఇప్పుడు సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో, ప్రేక్షకులకు ఇంతకుముందు తెలియని ప్రమాణాలతో ధారావాహికగా తయారైంది.

ఎక్కడా రాజీ పడకుండా నాటి కథాకాలాన్ని యథాతథంగా చిత్రీకరించేందుకు వందల మందిఎంతగానో శ్రమిస్తున్నారు. ఉన్నత స్టాయి సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ కాకతీయ సామ్రాజ్య వైభవాన్నిఅందించేందుకు దీక్షగా పనిచేస్తున్నారు.

తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకులకు విలక్షణమైన, వినూత్నమైన కథలతోఎన్నో సీరియల్స్‌ని అందించిన స్టార్‌ మా ఈసారి ప్రమాణాలను ఎన్నోమెట్టు పైకి ఎక్కిస్తూ ఈ సీరియల్‌ను జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారం చేయబోతోంది.

రద్రమదేవి ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/skLfg0BBq7w

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close