ఆ తప్పు తెలంగాణ సర్కార్‌ను వెంటాడుతూనే ఉంటుంది..!

తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్‌లను సరిహద్దుల్లో నిలిపివేయడం తీవ్ర స్థాయిలో వివాదాస్పదమవుతోంది. తెలంగాణ హైకోర్టు… తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని తేల్చింది. ఆర్టికల్ 14,19 1(d) ప్రకారం అంతర్ రాష్ట్ర సరిహద్దుల నుండి అంబులెన్స్ లను నిలిపి వేసి ఉల్లంఘన కు పాల్పడిందని తేల్చింది. నిజానికి అంబులెన్స్‌ల సమస్య పరిష్కారం అయిందని ఏపీ సర్కార్ ప్రకటించింది. అర్థరాత్రి నుంచి అందర్నీ అనుమతిస్తున్నారని చెప్పింది. కానీ సమస్య పరిష్కారం కాలేదు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో బెడ్స్ ఖరారు చేసుకున్న వారికి మాత్రమే అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు. సరిహదుల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు నిలిచి ఉన్నాయి.

ఈ విషయంపై హైకోర్టుకు సమాచారం అందడంతో సీరియస్ అయింది. ఆర్ఎంపీ వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తో ఇక్కడికి వస్తున్నారని ందుకే ఆపేస్తున్నాని ఏజీ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ విరవణపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేయలేదు. హైదరాబాద్ అనేది మెడికల్ హబ్ .. ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు..రావొద్దని చెప్పడానికి మీకు ఏం అధికారం ఉందని సూటిగా ప్రశ్నించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అంతర్జాతీయ పేషెంట్లు ఉంటారు.. వాళ్లను కూడా ఇలానే అడ్డుకుంటారా అని మండిపడింది. రేపటిలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రేపట్నుంచి లాక్ డౌన్ విధింపుతో సహజంగానే ఆంక్షలు అమల్లోకి వస్తాయి. పర్మిషన్ తీసుకున్న అంబులెన్స్‌లకే అనుమతి ఇస్తారు. హైదరాబాద్ దవాఖానాల్లో ఇతర రాష్ట్రాల వారు చికిత్స పొందకుండా.. తెలంగాణ హైకోర్టు చేసిన ప్రయత్నం వల్ల.. తెలంగాణ శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇ్బబందులు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close