ఆంధ్రప్రదేశ్ రాజకీయం-పవనోఫోబియా

21 ఏప్రిల్ 2018 పవనోఫోబియా అనే మానసిక వ్యాధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులకి, వారి మానసపత్రికలకి, టివి చానెల్స్ కి సోకిన రోజు. పవన్ కళ్యాణ్ అనే పేరు తలచుకోవాలంటే భయపడిన రోజు. ఏ క్షణంలో ఎవరి పేరు బయటపెడతాడో అని మానసికక్షోభకి గురైన రోజు. వ్యవస్థ పైన యుద్ధం మొదలైన రోజు.

జనసేన పార్టీ ఆవిర్భావం:

ఓట్లు చీల్చడం ఇష్టం లేక 2014 ఎన్నికల్లో పాల్గొనడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఇదే అదనుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ సమేతంగా వెళ్లి పవన్ మద్దత్తు కోరడం, పవన్ దానికి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. సానుభూతి ఓటు బ్యాంక్ వల్ల జగన్ అధికారంలోకి వస్తాడన్న భయం తెదేపా శ్రేణుల్లో మెల్లగా తగ్గడం జరిగింది. బిజెపి కూడా మద్దతు తెలపడంతో తెలుగు దేశానికి మానసిక ధైర్యం పెరిగింది.

2014 ఎన్నికలు:

పవన్ కళ్యాణ్ కేవలం మద్దతు తెలపడమే కాక, స్టార్ట్ campaigner లేని తెదేపాకి (బాలకృష్ణ ఉన్నా అంతగా ప్రభావం ఉండదు, ఎన్టీఆర్ పార్టీ కి దూరంగా ఉన్నాడు) ఒక గెలుపు గుర్రంలా మారాడు. తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు, కేసీఆర్, కాంగ్రెస్, జగన్ ల పై పదునైన విమర్శలు. ఒక విధంగా చెప్పాలంటే కూటమిని తన భుజాల పై ఎత్తుకున్నాడని కనీస రాజకీయజ్ఞానం ఉన్న వారు చెప్పగలరు.

పవన్ కి మీడియా కల్పించిన ప్రచారం అంతా ఇంతా కాదు.పవన్ రిఫరెన్స్ లేని న్యూస్ లేనేలేదు. ఎన్నికలు ముగిశాయి.తెలంగాణాలో టిఆర్ఎస్, ఆంధ్రాలో కూటమి, కేంద్రంలో NDA గెలిచాయి. తమ విజయానికి కృషి చేసిన పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో పార్లమెంటులో NDA సమావేశానికి, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి గౌరవించారు.

అమరావతి శంకుస్థాపన:

కొన్ని రోజుల్లో ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్న రోజులు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇంతకన్నా సరైన సందర్భం లేదు. అట్టహాసంగా జరిగిన శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మోడీ కేవలం నీళ్లు మట్టి ఇచ్చి ప్రత్యేక హోదా పేరు కనీసం ఎత్తకుండా వెళ్లిపోయారు. ఆంధ్రా ప్రజల ఆశల మీద వెంట తెచ్చిన నీళ్లు చల్లి, నోట్లో మట్టి కొట్టారు.

దుబారా ఆరంభం:

తన సొంత నివాసం నిర్మాణ సమయంలో పార్క్ హయత్ హోటల్ కి ప్రభుత్వ ఖజానా నుంచి అందిన మొత్తం అక్షరాలా కేవలం 20 కోట్ల రూపాయలు. హైదరాబాద్ లోని అప్పటి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లోని రెండు బ్లాకులు మరియు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ల ఆధునీకరణ కోసం 45 కోట్ల రూపాయల ఖర్చుచేశారు. మొత్తం మీద 100 కోట్ల రూపాయల వరకూ ఖజానాకి గండి పడింది.

ఓటుకి నోటు:

అనూహ్యంగా ఓటుకి నోటు కేసు తెరమీదకి వచ్చింది. జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కాకపోయినా, ఎవరు కాదన్నా ఈ ఒక్క కేసు ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఒక కొత్త మలుపు తిప్పింది. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబే కర్త కర్మ క్రియ అనేది విధితమే. పక్కా ఆధారాలతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ వ్యవహారం చంద్రబాబు మెడకి ఉచ్చు బిగించేందుకు పావులు కదుపుతున్న సమయంలో ఆంధ్రా తెలంగాణా పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు తలవంచుకుని అమరావతికి రావడం. హైదరాబాద్ నుంచి ఉద్యోగుల్ని తరలించడం, తాత్కాలిక అనే పదాన్ని ఉపయోగించి వేల కోట్ల రూపాయల్ని ఖర్చు చేయడం జరిగింది.

పవన్ కళ్యాణ్ తిరుగుబాటు:

రైతుల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ రాజధాని భూముల సమస్యలు తెలుసుకోవడానికి అమరావతి వెళ్లడం వాళ్ళకి మద్దత్తు తెలపడం జరిగింది. ఇక కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తెలిశాక పవన్ కళ్యాణ్ హోదా కోసం సభలు పెట్టడం, కేంద్రాన్నీ రాష్ట్రాన్నీ నిలదీయడం జరిగాయి.

ప్రత్యేక ప్యాకేజీ:

ఉద్రిక్తతని తగ్గించేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం, “గత స్మృతుల” కారణంగా చంద్రబాబు కూడా తప్పక సరే అనడం, వెంకయ్య నాయుడుకి ఘన సన్మానం చకచకా జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ ఈ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా అభివర్ణించారు.
ఇచ్చింది ఎంతో తీసుకుంది ఎంతో పెద్దలకే తెలియాలి. ఇక ఆట మొదలు హోదా కావాలి అని కొన్ని రోజులు ప్యాకేజీ కావాలి అని కొన్ని రోజులు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును మీరు కాదు మేమే పూర్తి చేస్తాము డబ్బు ఇవ్వండి అని అడిగి దాన్ని కేంద్రంతో ఒప్పించడం ఎందుకో ప్రజలకి తెలుసు.

దుబారా, దుబారా, దుబారా:

సింగపూర్,టోక్యో, బీజింగ్ తరహా రాజధాని నిర్మాణం అని చెప్పి డిజైన్లకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, వాటిని కాదని వేరే వాళ్ళ చేతి లో పెట్టి, విదేశాల నుంచి ఆర్కిటెక్ లని రప్పించి, వీళ్లు అక్కడికి వెళ్లి వచ్చి రోజుకో డిజైన్, నెలకో ట్రిప్, ఈ ట్రిప్ లకి, ఇచ్చిన అడ్వాన్స్ లకి అయిన ఖర్చు ప్రతిపక్షాలు అడిగినా ఇవ్వలేదు. ఆ ట్రిప్ లు కూడా ప్రైవేట్ జెట్ లలో. ఇక రాజధాని రైతులని సింగపూర్ తీసుకువెళ్లడం అనేది దుబారాకి పరాకాష్ట.

ఇక ప్రత్యేక హోదా మీద, ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ ని అటు భాజపా ఇటు తెదేపా లకి చెందిన నేతలు మెల్లమెల్లగా తమ దాడిని పెంచారు. అంతకంతకూ పవన్ ఉధృతి పెరుగుతోంది తప్ప ఎప్పుడూ వెనకాడింది లేదు. అసెంబ్లీలో మైకు ఇవ్వటం లేదని ప్రతిపక్షం శాసన సభకు వెళ్లడం మానేసింది.

ఇక ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం తన పని మరచిన రోజు ఏ ప్రభుత్వానికి అయినా కళ్లెం లేని గుర్రంలా మారుతుంది.

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం:

ఇక ఎన్నికలకి సంవత్సరం నుండి పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టేందుకు సినిమా రంగంలో ఫెయిల్ అయిన తృతీయ శ్రేణి నటీనటులు, అదీ చేతకాని దర్శకత్వంలో చేయి కాల్చుకొని ఖాళీగా ఉన్న ప్రాణులన్నింటి మీడియా అనే దానితో కలిపి పవన్ కళ్యాణ్ విధానాలను కాకుండా అతని వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేస్తూ ఉన్న కార్యక్రమాలను గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి అదే రోత కార్యక్రమాలు.

దేశం ఎటు పోయినా, రాష్ట్రం ఎటు పోయినా అనవసరం. ఉన్నది ఒక్కటే టాపిక్ పవన్ కళ్యాణ్. ఇంతలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సదరు తృతీయ శ్రేణి నటీనటుల్ని పవన్ ఫ్యాన్స్, జనసేన అభిమానులు కూడా ఘాటుగా విమర్శించడం, కొంత మంది ఫోన్లు చేసి తిట్టడం మళ్లీ ఆ కాల్ recordingలని తీసుకుని వచ్చి అవే చానెల్ లలో కూర్చోవడం, చూస్తున్న జనాలకి రోత పుట్టించడం..ఇంతలో తెలుగు సినీ కళాకారులను రక్షిస్తాను అంటూ ఒక కొత్త అవతారం టీవీలలో ప్రత్యక్షం. మళ్లీ అదే సీన్. చివరికి పవన్ కళ్యాణ్ ని అమ్మనా బూతులు తిట్టే వరకూ తీసుకు వెళ్లారు.

అగ్నిపర్వతం బద్దలైన రోజు:

ఎన్నికలు రాబోతున్నాయి, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది లేదు అని జనాలకి స్పష్టం అయింది. ఇది నేతల వరకూ వెళ్లి, ఇక తప్పక చంద్రబాబు మొట్ట మొదటి దీక్షకి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపే దీక్ష అనగా ఏప్రిల్ 20 అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ అనే అగ్ని పర్వతం తన Twitter అకౌంటు ద్వారా లావా అనే ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. చంద్రబాబు, లోకేష్, మీడియా అధినేతలు మొదలుకొని తన మీద జరుగుతున్న విషకార్యక్రమాలకి కారణం అయిన ప్రతీ ఒక్కరి మీద తీవ్ర ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. ఆడవాళ్లతో తిట్టించే చానెళ్లను బహిష్కరించమని పిలుపునిచ్చారు. ఇక ఈ అలజడికి అప్పటివరకూ పవన్ నామస్మరణ చేసిన చానెళ్లు అన్నీ ఏప్రిల్ 20 న పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తడానికి కూడా భయపడ్డాయి.

పవనోఫోభియా మొదలు:

ఏదో కొన్ని తెలంగాణా చానెళ్లు తప్ప పవన్ ట్వీట్లని ప్రస్తావించిన తెలుగు చానెల్ అంటూ ఏమీ లేదు. అన్నీ తేలుకుట్టిన దొంగల్లాగా కేవలం 12 గంటలపాటు 21 కోట్లు ఖర్చుపెట్టి చేసిన చంద్రబాబు దీక్షని మాత్రమే ప్రచారం చేశాయి. ఇక దమ్మున్న చానెల్ అధినేత కొంచెం ముందుకు వెళ్లి ఆ మహిళ తిట్టిన తిట్టులోని పెద్దగా బూతు ఏమీ లేదనీ, తెలంగాణా, ఉత్తర భారతదేశంలో ఇది ఒక ఊతపదంగా అభివర్ణించి విమర్శల పాలు అయ్యారు. ఇక ఆ న్యూస్ చానెల్ ని వేరే పేరుతో పిలవడం జనాల్లో పరిపాటి అయింది.

ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలని చానెళ్లు ప్రసారం ఆపేయడం లేదా ఫిల్టర్ చేయడం ప్రారంభించాయి. అది ఎలా అంటే జగన్ ని విమర్శించే వరకూ live ప్రసారం చేసి ఆ విమర్శలు చంద్రబాబు వైపు మళ్లేటప్పుడు live ఆపేయడం. అదే విధంగా ప్రతిపక్ష చానెల్ కూడా చంద్రబాబుని విమర్శించేటప్పుడు live లో చూపడం, జగన్ మీద విమర్శించేటప్పుడు live ఆపేయడం.

ఏంటి ఇంత భయం? ఎవరిని రక్షించడానికి ఈ తాపత్రయం, వెనుకడుగు. మెరుగైన సమాజం కోసం పెట్టిన దమ్మున్న చానెళ్లన్నీ పవన్ కళ్యాణ్ ని పదే పదే తిడుతూ ప్రసారం చేసింది నిజంగా మరుగైన సమాజం కోసమేనా. కట్నం తీసుకున్నవాడు గాడిద అని ప్రచారం చేసి లంచం తీసుకుని ఒకరికి కొమ్ము కాసే వ్యక్తులు అడ్డ గాడిదలతో సమానం అనేది సదరు మీడియా అధినేలందరూ ఆలోచన చేయాలి.
యెల్లకాలం ఇలానే చానెళ్లని, పత్రికలని నడవడం కుదరదు. ఎందుకంటే రేపు పవన్ అధికారంలోకి రావచ్చు లేదా రాకపోవచ్చు. రేపు శాసనసభలో అడుగు పెట్టాక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు అని live ఆపడం కుదరదు. ఒకవేళ ఆపినా జనం హర్షించరు.

పత్రికారంగం(వెబ్ న్యూస్ తో సహా), టివి రంగం అనేవి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలే తప్ప, ప్రభుత్వంతో అపవిత్రమైన పొత్తుపెట్టుకోరాదు. కళ్లు తెరుచుకుని తమ పని తాము అంతఃకరణం శుద్దితో నిర్వహిస్తారా లేక విలువల్ని అమ్ముకునే presstitutes గా చరిత్రలో మిగిలిపోతారా అనేది కాలమే నిర్ణయించాలి. ఇక ఇప్పటి వరకూ ప్రభుత్వం సాధించామని చెప్పుకుంటున్న ఘనతలు ఒకటి KIA, రెండు హైకోర్టు నిర్మాణం. దీనికి తోడు అంపశయ్య మీద ఉండి తనను తాను రక్షించుకునేందుకు అన్న canteen, ద్వాక్రా మహిళలకి అదనంగా పసుపు-కుంకుమ, ఆకు-వక్క పేరుతో పదివేల రూపాయలు ఇవ్వడం, దీక్షల పేరుతో కోటానుకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, పోలవరం సందర్శన కోసం దాదాపుగా 400 కోట్లను ఖర్చుచేయడం ఏమాత్రం ఆమోఘ్యయోగ్యం కాదు.

ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం, ప్రతిపక్షం, టీవీ, పత్రికా రంగం, మేధావి వర్గం అందరూ ఫెయిల్ అయ్యారు అనేది స్పష్టం. ఇకనైనా పవనోఫోభియా నుంచి బయటకు వస్తారా? ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారా? మార్పు సాధ్యమేనా?ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకుంటారా? కనీసం వచ్చే ప్రభుత్వం అయినా ప్రత్యేక హోదాని సాధించి మనకి రావాల్సినవి కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోకుండా ముక్కు పిండి మరీ తీసుకు వస్తుందా?

నానా పాటేకర్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close