ఏకగ్రీవం అవుతాయని తెలిసినా ఎన్నికలు వాయిదా..! కేసీఆర్ ప్లానేంటి..?

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సిద్ధమయిందని.. ఆరుగురికి ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయని ఆశావహులు పండుగ చేసుకుంటున్న సమయంలో కేసీఆర్ వారందరికీ పిడుగులాంటి వార్త పంపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడల్లా సాధ్యం కాదని నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాశారు. దీనికి కారణం కరోనానే చూపించారు . రోజుకు ఆరు వందల కేసులు నమోదవుతున్నాయని ఇంకా.. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని… ఈసీకీ తెలంగాణ సర్కార్ తెలిపింది. దీంతో అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడల్లా జరిగే చాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఆరు స్థానాలు ఖాళీ అయి.. రెండు నెలలు అవుతోంది. అప్పట్లో కరోనాకారణంగా ఈసీనే వాయిదా వేసింది.

ఇప్పుడు.. ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉన్నా.. తెలంగాణ సర్కార్ వద్దంటోంది. అయితే అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు వద్దనుకోవడానికి కారణం కరోనా కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆశావహులందర్నీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు కాబట్టి.. ఎవరూ అసంతృప్తికి గురి కాకుండా చేయడానికేనని అంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఆరు ఎమ్మెల్సీ సీట్లకు… ఇరవై మంది వరకూ పోటీ పడుతున్నారు. చాన్స్ రాని వాళ్లు… హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని.. కేసీఆర్ అంచనా వేసినట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన పదవుల భర్తీని వాయిదా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

నిజానికి అవి ఎమ్మెల్యే కోటా ఎన్నికలు. అన్నీ ఏకగ్రీవంగా పూర్తవుతాయి. ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉండదు. అయినా అదేదో కరోనా వ్యాప్తి ఈవెంట్ అన్నట్లుగా కేసీఆర్ కలరింగ్ ఇచ్చి ఎన్నికల వాయిదాకు నిర్ణయించడం… కొంత మందిని ఆశ్చర్య పరుస్తోంది. హుజూరాబాద్ ఎన్నిక పెట్టాలనుకుంటే… వద్దని ఈసీకి సందేశం పంపడం కూడా ఇందులో ఇమిడి ఉందని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్.. ఏ విషయాన్నైనా రాజకీయంగా వాడుకోవడంలో ముందుంటారని రాజకీయ వర్గాలు మరోసారి వ్యాఖ్యానించడం ప్రారంభించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close