రివ్యూ: తెగింపు

Thegimpu movie telugu review

తెలుగు360 రేటింగ్ 2.5/5

ఒక ప్రొఫెసర్‌ ఒక టీమ్‌ని తయారుచేసి స్పెయిన్‌లోని రాయల్‌మింట్‌లో దోపిడీ చేసిన కథ… ‘మనీ హైస్ట్‌’. స్పానిష్‌లో ‘లా కాస డె పాపెల్‌’ పేరుతో 2017లో తీసిన ఈ వెబ్‌సిరీస్‌.. ఇంగ్లీష్‌లో ‘మనీ హైస్ట్‌’ పేరుతో డబ్‌ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వెబ్ సిరిస్ సంచలనం సృష్టించింది. రాబరీ సినిమాలు తీయాలనుకునే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ని కూడా ప్రభావితం చేసింది. ‘మనీ హైస్ట్‌’ స్ఫూర్తితో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. గతంలో విజయ్ చేసిన బీస్ట్ లో కూడా ‘మనీ హైస్ట్‌’ ఛాయలు కనిపించాయి. ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమా అజిత్ `తెగింపు` కూడా రాబరీ డ్రామాతో వచ్చింది. మరి ఇందులో `మనీ హైస్ట్‌` కి పోలిక ఉందా? తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా సంక్రాంతి బరిలో తొలి చిత్రంగా దిగిన ‘తెగింపు’ ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ?

‘యువర్ బ్యాంక్’ అనేది ఒక ప్రైవేట్ బ్యాంక్. ఈ బ్యాంక్ లో రిజర్వ్ బ్యాంకు నియమాలని అతిక్రమిస్తూ ఐదు వందల కోట్ల రూపాయిలు వున్నాయని పోలీస్ అధికారైన అజయ్ కి సమాచారం అందుతుంది. ఆ డబ్బుని రాబరీ చేయలాని స్కెచ్ వేస్తాడు అజయ్. ఒక టీంగా వెళ్ళిన దుండగులు బ్యాంక్ లో అందరినీ బంధీలుగా చేసి ఐదు వందల కోట్ల కోసం అక్కడ గాలిస్తుంటారు. ఇంతలో డార్క్ డెవిల్ (అజిత్ కుమార్) రూపంలో ఒక షాక్ తగులుతుంది. దోపిడీకి వచ్చిన గ్యాంగ్ ప్లాన్ ని చిత్తు చేశాడు డార్క్ డెవిల్. దీంతో బంధీలుగా వున్నవాళ్లంతా ఊపిరి పీల్చుకుంటారు. అయితే తాను వచ్చింది కూడా దోచుకోవడానికే అంటూ మరో షాక్ ఇస్తాడు డార్క్ డెవిల్. అయితే తాను దోచుకునే మొత్తం ఐదు వందల కోట్లు కాదు.. 25వేల కోట్లు. మరి అంత డబ్బు యువర్ బ్యాంక్ లోకి ఎలా వచ్చింది ? ఈ రాబరీలోకి డార్క్ డెవిల్ ఎలా వచ్చాడు ? అతను ఎవరు ? 25వేల కోట్లని దోచుకున్నాడా ? అనేది మిగతా కథ.

రాబరీ కథలకు కొత్త స్ఫూర్తిని ఇచ్చింది ‘మనీ హైస్ట్‌’. తెగింపు దర్శకుడు వినోద్ `మనీ హైస్ట్‌’ ఛాయల్లోనే ఈ కథని ప్లాన్ చేశాడు. అయితే ఇది ఫస్ట్ హాఫ్ వరకే.. సెకండ్ లో తెగింపు కథకు రాబిన్ హుడ్ టచ్ ఇచ్చాడు. దీంతో తెగింపు ఫస్ట్ హాఫ్ ఒక కథ.. సెకండ్ హాఫ్ లో మరో కథలా అనిపిస్తుంది. కథని ఓపెన్ చేయడంలోనే చాలా గంద‌రగోళం కనిపిస్తుంది. తెలివైన స్క్రీన్ ప్లే అంటే ప్రేక్షకులని తికమకపెట్టే స్క్రీన్ ప్లే కాదు. వాళ్ల‌ని ఆలోచ‌న‌ల్లో ప‌డేయాలి. కానీ తెగింపులో అది క‌నిపించ‌దు. తొలి ఇరవై నిమిషాలు తికమకగా వుంటుంది. ఒక కథ ఓపెన్ చేసినప్పుడు ఎదో ఒక ఎమోషన్ తో ప్రేక్షకుడు కనెక్ట్ కావాలి. లేదంటే తెరపై జరుగుతున్న వ్యవహారం అంతా మనకి అవసరం లేని తంతు అనిపిస్తుంది. తెగింపులో కూడా ఇదే జరిగింది.

రాబరీ కథల్లో ఉత్కంఠ నెలకొల్పడం చాలా కీలకం. బంధీలుగా వున్న అమాయకులకు ఏదైనా జరుగుతుందేమో అనే టెన్షన్ క్రియేట్ కావాలి.. ఇందులో అజిత్ ప్రతి నాయకుడు లక్షణాలతో రాబరీ సీన్ లో ప్రత్యేక్షమైననప్పటికీ.. అజిత్ వుంటే సామాన్యులకు ఏం కాదులే అని రిలాక్స్ అయిపోతారు ప్రేక్షకులు. ఇది కంప్లీట్ గా దర్శకుడి వైఫల్యం. హీరో పాత్రకి ఎలాంటి పరిచయం లేకుండానే రాబరీ సీన్ లో ఓపెన్ చేస్తే… ఇతగాడు ఏదో మంచి ఉద్దేశంతోనే సీన్ లో వున్నాడనే ఫీలింగ్ వచ్చేసిన తర్వాత ఎంత క్రూరంగా బిహేవ్ చేసిన లాభం వుండదు. భారీ బాంబ్ బ్లాస్టులు.. దీపావళి వేడుకలా తుపాకులు పేలుతున్నా తెరపై ఎదో తంతు నడుస్తుందనే ఫీలింగ్ తప్పితే వాటిని ఎంజాయ్ చేసే పరిస్థితి వుండదు.

రాబరీ ముఠా బ్యాంక్ లోకి వెళ్ళడం, బయట పోలీసులు, మీడియా వ్యవహారం, టీవీలో రాబరీ ముఠాకి సపోర్ట్, వాళ్ళని హీరోలుగా ఆరాధించడం.. ఫోన్ లో పోలీసుల రాయబారాలు ఇవన్నీ ‘మనీ హైస్ట్‌’ నే గుర్తుకు తెస్తాయి. అయితే దీన్ని పూర్తి రాబరీ డ్రామాగా నడిపినా బావుండేది. సెకండ్ హాఫ్ లో ఆర్ధిక నేరాల పాఠం కింద మారిపోతుంది. బ్యాంకులు సామాన్యులని ఎలా మోసం చేస్తాయని చెప్పడానికి సెకండ్ హాఫ్ సరిపోతుంది. నిజంగా ఇది ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి చెప్పే పాఠం లాంటిదే. నేరానికి పాల్పడిన అందరినీ బ్యాంక్ లోకి పిలిచి బెత్తంతో కొడుతూ వాళ్ళు చేసిన తప్పులని చెప్పడం సోషల్ పిరియడ్ లానే సాగుతుంది. బిల్లాలో అజిత్ బ్యాడ్ బాయ్ లా కనిపిస్తాడు. దీన్ని కూడా అలానే ట్రీట్ చేసివుంటే బావుండేది. కానీ ఒక డార్క్ డెవిల్‌ని .. రాబిన్ వుడ్ లా మార్చే ప్రయత్నం సరిగ్గా కుదరలేదు. ఇందులో ప్లస్ పాయింట్స్ కూడా వున్నాయి. భారీ యాక్షన్ సీన్లు కనిపిస్తాయి. చివర్లో సముద్రంలో డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ ఒక ప్రధాన ఆకర్షణ. యాక్షన్ ని ఇష్టపడే వారికి ఇవన్నీ బాగా న‌చ్చుతాయి.

తెగింపు అజిత్ వన్ మ్యాన్ షో . అజిత్ తనదైన గ్రేస్ తో అలరించాడు. తన పాత్రలో ఒదిగిపోయాడు. అజిత్ లుక్ , యాక్షన్ స్టయిల్ అభిమానుల్ని అలరిస్తాయి. మంజు వారియార్ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సముద్రఖనికి ఇది అలావాటైన పాత్రే. పావని రెడ్డి, అజయ్ తో పటు మిగతా పాత్రధారులు పరిధిమేర నటించారు. మీడియా ప్రతినిధిగా చేసిన నటుడు, మరో పోలీసు కి మధ్య కామెడీ ట్రాక్ వుంది. అయితే ఆ ట్రాక్ కి తెలుగు టైమింగ్ సరిగ్గా కుదరలేదు.

జిబ్రాన్ నేపధ్య సంగీతం హెవీగా వుంది. నిజానికి అంత అవసరం లేదు. దాదాపు సినిమా అంతా సౌండ్ వినిపిస్తూనే వుంటుంది. ఒక దశలో చిరాకు పెడుతుంది. నిరవ్ షా కెమరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. విజువల్స్ రిచ్ గా వున్నాయి. నిర్మాణ విలువలు బావునాయి వున్నాయి. తెలుగు డబ్బింగ్ పై ఇంకాస్త ద్రుష్టి పెట్టాల్సింది. ఒక్క పాట కూడా గుర్తుండదు. ‘మనీ హైస్ట్‌’ లాంటి సినిమా తీద్దామని ప్రయత్నించి రాబిన్ వుడ్ గా మార్చి చివరికి ఒక సోషల్ పాఠంగా సినిమాని ముగించిన తీరు అంతగా ఆకట్టుకోదు.

ఫినిషింగ్ ట‌చ్‌: ‘తెగింపు..’ కాదు ‘మ‌నీ హైస్ట్‌’కి అతికింపు

తెలుగు360 రేటింగ్ 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close