రివ్యూ : ‘తిక్క’ తిక్కగా వున్నది…

చేసింది నాలుగే సినిమాలైన మూడు చిత్రాలతో హ్యాట్రిక్ స‌క్స‌ెస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్‌ తేజ్, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా జంట‌గా, సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, నయా నిర్మాత డాక్ట‌ర్. సి.రోహిన్ రెడ్డి నిర్మాత‌గా శ్రీ వెంకటేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో భారీ బడ్జెట్ తో మాస్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందిస్తున్న చిత్రం ‘తిక్క’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ రోజు విడుదల అయ్యింది. మరి సాయిధరమ్ తేజ్ రెండవ హాట్ట్రిక్ కి శ్రీకారం చుట్టబోతున్నాడా….? దర్శకుడు సునీల్ రెడ్డి ‘ఓం త్రీడి’ లాంటి ఫెయిల్యూర్ మూవీ తరువాత వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా…? సమీక్ష లో తెలుసుకుందాం…

కథ :

ఆదిత్య (సాయిధరమ్ తేజ్) అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉండే జులాయి లాంటి వాడు. తాగడం, అమ్మాయిల వెంట పడడం తప్ప పని పాట లేని ఆదిత్య జీవితంలోకి అంజలి (లారిస్సా బొనెసి) ప్రవేశిస్తుంది. మొదటి చూపుతోనే ఆదిత్య, అంజలి ప్రేమలో పడతారు. వారి ప్రేమ ప్రయాణం అలా సాఫీగా సాగుతుండగానే, కొన్ని అనుకోని కారణాల వల్ల అంజలి, ఆదిత్య ను పక్కన పెడుతుంది. ఇది తట్టుకొని ఆదిత్య, మళ్ళీ తాగడం మొదలుపెడతాడు. ఓ రాత్రి తప్ప తాగి అతడు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల కథంతా పూర్తిగా మారిపోతుంది. ఆదిత్య చేసిన ఆ తప్పులేంటి? అంజలి, ఆదిత్య ను ఎందుకు తిరస్కరిస్తుంది..? ఎన్నో మలుపులు తిరిగిన కథ చివరకు ఎక్కడకు చేరుతుందీ? అన్నదే మిగతా సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

ఈ సినిమాకు అన్నివిధాలా ఆకర్షణ అంటే నిస్సందేహంగా సాయిధరమ్ తేజ్ అనే చెప్పాలి. సినిమా మొత్తం నీరసంగా నడిచే సదా సీదా కథను కూడా తన ఎనర్జిటిక్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ప్రతి సన్నివేశం లో కథ అవసరానికి తగ్గట్టు ఎంటర్టైన్ చేయడంలో సాయిధరమ్ తేజ్ ప్రేక్షకులను మెప్పించాడు అని చెప్పొచ్చు . హీరోయిన్స్ లారిస్సా బొనెసి, మన్నారా చోప్రాలు కేవలం గ్లామర్ డాల్స్ గా ఉపయోగ పడ్డారు తప్పితే సినిమా కు ఏ విధంగా ప్లస్ కాలేదు. ఇక అజయ్, అతడి గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ ఓ కె . ఆలీ-ముమైత్ ఖాన్‌ల ట్రాక్ అస్సలు బాగోలేదు. ఉండటానికి చాలా మంది ఆర్టిస్ట్స్ వున్నా కథ ఏ మాత్రం ఉపయోగం గా లేరు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే, మొదటి సినిమా ‘ఓం త్రీడి’ అతనికి మంచి అవకాశం, ఆ సినిమా పరాజయం అయినా సరే, సక్సెస్ లో వున్నా హీరో సాయి ధరమ్ తేజ్, ఒక సాలిడ్ ప్రొడ్యూసర్ లభించడం అతనికి సువర్ణ అవకాశం అలాంటిది…. ఒక కామెడీ సినిమాకు సరిపడే కథను చేతుల్లో పెట్టుకొని దాన్ని పూర్తిగా మిస్‌ఫైర్ చేశాడనే చెప్పుకోవాలి. కథ, కథనాల్లో పట్టు లేకుండా రాసిన సన్నివేశాలన్నీ బోరింగ్‌గా సినిమాను నడిపించాయి. కన్ఫ్యూజన్ కామెడీని అందించగల అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో టేకింగ్ పరంగా మొదటి పదినిమిషాలు మాత్రమే ఇంటర్వెల్‌ బాంగ్ లో డైరెక్టర్ గా తన ప్రతిభను చూపుకోగలిగాడు. కెమెరామెన్ కె.వి.గుహన్‌ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేము సినిమా దాదాపు నైట్ ఎఫెక్ట్ లో జరిగే కథకు తగ్గ లైటింగ్‌ను, మంచి ఫ్రేమింగ్‌ పెడుతూ గుహన్ తన ప్రతిభ చూపాడు. థమన్ అందించిన పాటల్లో రెండు వినడానికి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఎడిటింగ్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ :

ఈ మధ్య కామెడీ సినిమాల్లో కన్ఫ్యూజన్‌ కామెడీ డ్రామా అనేది బాగా ఉంటుంది. అలాంటి కథ తోనే ‘తిక్క’ కన్ఫ్యూజన్ చాలా ఉందని అనిపించేలా ఉన్నా, దాన్ని సినిమాగా మలచడంలో తేలిపోవడంతో చివరకు ఆ తిక్కే కథ కె బొక్క పడింధీ, కధనం బోల్తా కొట్టింది. ఈ సినిమాకు కథ కథనమే అతిపెద్ద మైనస్ పాయింట్స్ , ఫస్టాఫ్ అయితే పూర్తిగా లౌడ్ కామెడీతో నడుస్తూ సన్నివేశాలు సాగదీయడం తో చాలా బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మినహాయిస్తే ఫస్టాఫ్‌లో ఎలాంటి థ్రిల్ లేదు. సెకండాఫ్‌లో మళ్ళీ ఈ కన్ఫ్యూజన్‌ను అందుకొని నవ్వించే ప్రయత్నం చేసినా, అప్పటికే సినిమా అంతా తప్పు దారి లో పడటం తో మరి నీరసపడింధీ. హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. సాయిధరమ్ తేజ్ ఎనర్జిటిక్ డైలాగ్స్ అతనికున్న ఈజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడు. ఇక అంశాలన్నీ వేస్ట్ . ‘తిక్క’ అనే టైటిల్ పెట్టినందుకు ప్రేక్షకులు సినిమా చూసి తిక్క మొహాలు వేసుకు రావడం జస్టీ ఫై అయ్యింది.

తెలుగు360.కామ్ రేటింగ్ 1.5/5
న‌టీన‌టులు : సాయిధ‌ర‌మ్ తేజ్‌, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు రమేష్ ,పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలి, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, ప్ర‌భాస్ శ్రీను, స‌త్య‌, ఆనంద్‌, వి.జే.భాని, కామ్నా సింగ్‌ తది తరులు….
కెమెరా : కె.వి.గుహ‌న్‌
సంగీతం :ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌
ఎడిట‌ర్‌ : కార్తీక్ శ్రీనివాస్‌
ఆర్ట్‌ : కిర‌ణ్ కుమార్‌
క‌థ‌, స్క్రీన్-ప్లే : షేక్ దావూద్‌
మాట‌లు : హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, లక్ష్మి భూపాల్
పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, భాస్కరబట్ల రవి కుమార్, నీరజ కోన
సింగర్స్ : ధనుష్ (Hero), శింబు (Hero), ఎం.సి విక్కీ, ఉష ఉతుప్, సింహ, రేవంత్, యస్ యస్ థమన్
డాన్స్‌ : ప్రేమ్ ర‌క్షిత్‌
యాక్ష‌న్‌ : రామ్‌-లక్ష్మ‌ణ్‌, విలియ‌మ్ ఓ.ఎన్‌.జి, ర‌వివ‌ర్మ‌, జ‌ష్వా.
స‌హ‌నిర్మాత‌ : కిర‌ణ్ రంగినేని,
నిర్మాత‌ : డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి,
ద‌ర్శ‌కత్వం : సునీల్ రెడ్డి,
విడుదల తేదీ : 13.08.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com