ఈవారం బాక్సాఫీస్‌: శ్రీ‌దేవి సెంటర్లో ‘నో పార్కింగ్‌’

హిట్లో, ఫ్లాపులో.. వ‌సూళ్లు వ‌స్తున్నాయో, రావ‌ట్లేదో – ప‌క్క‌న పెడితే, ప్ర‌తీవారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త సినిమాల హ‌డావుడి క‌నిపిస్తోంది. జులై చివ‌రి వారం నుంచి మొద‌లైన ఈ హంగామా.. ఈనెల‌లో మ‌రింత ఎక్కువైంది. ప్ర‌తీవారం మూడు నాలుగు సినిమాలు వ‌స్తున్నాయి. చిన్న‌వో – చిత‌క‌వో – హ‌డావుడి మాత్రం చేస్తున్నాయి. ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ మండ‌పం, రాజ రాజ చోర – మంచి వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకున్నాయి. ఈవారం కూడా రెండు సినిమాలు రెడీ అయ్యాయి. రెండూ మాస్ సినిమాలే. రెండింటికీ ఓపెనింగ్స్ బాగుండే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. అవే.. శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిల‌ప‌రాదు.

ప‌లాస‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌. త‌న రెండో ప్ర‌య‌త్నం శ్రీ‌దేవి సోడా సెంట‌ర్. ఈ సినిమా బ‌య‌ట‌కు రాకుండానే గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు క‌రుణ కుమార్‌. ప‌లాస ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా నిలిచిపోయి, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటే – దానికి భిన్నంగా పూర్తి మాస్ అంశాల‌తో శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ ని తీర్చిదిద్దిన‌ట్టు అనిపిస్తోంది. ప్ర‌చార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సుధీర్ బాబు కూడా ఈ సినిమాపై న‌మ్మ‌కంతో ప్ర‌మోష‌న్లు భారీగా చేయిస్తున్నాడు. ప్ర‌భాస్ ని దించాడు. మ‌హేష్ అండ ఎలానూ ఉంది. కాస్త మంచి బ‌జ్ వ‌చ్చినా – ఈ సినిమాని లాక్కెళ్లిపోగ‌ల‌డు. ఎలా చూసినా ఈ వారం విడుద‌ల‌య్యే రెండు సినిమాల్లో శ్రీ‌దేవి సోడాకి మంచి ఓపెనింగ్స్ వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

మ‌రోవైపు… సుశాంత్ `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిల‌ప‌రాదు` అంటూ హెచ్చ‌రిస్తున్నాడు. టైటిల్ బాగుంది. ఇదే ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ఎలిమెంట్. ప్ర‌చార చిత్రాలూ ఆక‌ట్టుకుంటున్నాయి. కొత్త త‌ర‌హా కాన్సెప్టుల్ని ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డున్నారు. స్టార్ కాస్టింగ్ తో సంబంధం లేకుండా.. హిట్స్ ఇస్తున్నారు. ఆ ల‌క్ష‌ణాలు ఈ సినిమాలో క‌నిపిస్తున్నాయి మ‌రి. ఈ రెండూ మాస్ చిత్రాలే. ప్రేక్ష‌కుల‌కు ఇప్పుడు కావ‌ల్సింది ఇలాంటి సినిమాలే కాబ‌ట్టి – ఈవారం బాక్సాఫీసు క‌ళ‌క‌ళ‌లాడే అవ‌కాశాలు బాగానే క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close