తాటి చెట్టుపై మంటలు!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజులో పిడుగుపాటు ఘటనలకు 20మంది చనిపోయారు. ముందెన్నడూ లేనివిధంగా ఏపీలో ఒకేరోజు పిడుగులకు ఇంతమంది చనిపోవటం సంచలనం సృష్టించింది. నెల్లూరుజిల్లాలో అత్యధికంగా ఆరుగురు, ప్రకాశం, కృష్ణాజిల్లాలలో నలుగురు చొప్పున పిడుగుపాటు ఘటనలలో మరణించారు. పొలాలలో పనులు చేసుకుంటున్నవారే ఎక్కువగా ఈ పిడుగుపాటు ఘటనలలో చనిపోయారు. రాష్ట్రప్రభుత్వం రు.4 లక్షల చొప్పున ఎక్స్‌‍గ్రేషియా ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణికారణంగా కురుస్తున్న ఈ వర్షాలు ఖరీఫ్ పంటలకు వరదాయకంగా మారటంతో రైతులు ఆనందపడుతున్నప్పటికీ సామాన్య ప్రజలుమాత్రం సతమతమవుతున్నారు. ఈ పిడుగుపాటు ఘటనలు ఇవాళకూడా కొనసాగొచ్చని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు గుంటూరుజిల్లా పేరేచర్లలో క్రికెట్ స్టేడియమ్ గ్రౌండ్‌లో ఉన్న ఒక తాటిచెట్టుపై పిడుగుపడటంతో చెట్టు మొవ్వలో నిప్పు రాజుకుని మంటలు రేగాయి. ఆ సమయంలో ఆ స్టేడియమ్‌లో అంతర్ రాష్ట్ర వుమన్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. గ్రౌండ్‌లో ఉన్న ఆంధ్ర, త్రిపుర రాష్ట్రాల క్రికెట్ టీమ్‌లు ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్నాయి. నిర్వాహకులు వెంటనే టీమ్‌ల సభ్యులను గ్రౌండ్ నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయారు.

ప్రకృతి వైపరీత్యాలలో ఎక్కువమంది చనిపోయేది పిడుగుల వలనేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది.గత 45 సంవత్సరాలలో పిడుగులవలన 80వేలమంది చనిపోయారని తెలిపింది. పిడుగుల శబ్దం వినపడగానే ఏదైనా కాంక్రీట్ భవనంలోకి వెళ్ళి తలదాచుకోవాలని, 30-45 నిమిషాలదాగా బయటకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పిడుగులు గ్రామీణప్రాంతాలలో మాత్రమే పడతాయనుకోవటం అపోహ అని, క్యుములోనింబస్ మేఘాలు ఆవరిస్తే పట్టణ ప్రాంతాలలోకూడా పడొచ్చని చెబుతున్నారు. చెట్లకిందగానీ, స్తంభాలకిందగానీ నిలుచోకూడదని సూచిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close