‘సితార‌’ క‌థ స‌మాప్తం

దాదాపు నాలుగు ద‌శాబ్దాల చ‌రిత్ర ‘సితార‌’ సినీ వార ప‌త్రిక‌ది. ‘ఈనాడు’ సంస్థ‌ల్లో సితార కూడా ఒక‌టి. రామోజీ రావు మాస‌న పుత్రిక‌గా సితార‌ని పేర్కొంటారు. అలాంటి సితార వార ప‌త్రిక‌కు ‘శుభం’ కార్డు ప‌డింది. గ‌త కొన్నేళ్లుగా సితార‌ని మూసేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు అదే నిజ‌మైంది. ‘సితార‌’ ఆఖ‌రి ప‌త్రిక ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఇక‌పై ‘సితార‌’ రాదు. వార ప‌త్రిల్లో సితార స్థానం సుస్థిరం. జ్యోతి చిత్ర లా ఉన్న‌త ప్ర‌మాణాలు పాటిస్తూ, సినిమా ప‌రిజ్క్షానాన్ని పాఠ‌కుల‌కు అందిస్తూ త‌న ప్ర‌త్యేక‌త చాటుకుంది సితార‌. ఏ వార ప‌త్రిక తిర‌గేసినా సినిమాల తాలుకూ,యాడ్లే క‌నిపిస్తాయి. సితార మాత్రం… కావ‌ల్సినంత స‌మాచారం, కావ‌ల్సిన మేర‌కు అందిస్తూ వ‌చ్చింది. వార ప‌త్రిక‌ల‌కు కాలం చెల్లిపోవ‌డంతో పాటు ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ అవ్వ‌డం సితార‌కు శాపంగా మారింది. నిర్వ‌హ‌ణా వ్య‌యం రోజురోజుకీ ఎక్కువ‌వ్వ‌డంతో ‘సితార‌’ ప‌త్రిక‌ను ఆపేస్తూ.. యాజ‌మాన్యం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ‘ఈనాడు’ నుంచే వ‌చ్చే విపుల‌, చ‌తుర‌ల ప‌రిస్థితి కూడా అగ‌మ్య‌గోచరంగానే ఉంది. వీటిపైనా యాజ‌మాన్యం అతి త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని స‌మాచారం. ఎన్నో యేళ్లుగా పాఠ‌కుల్ని అల‌రించిన ‘సితార‌’.. ఇక ముందు క‌నిపింక‌పోవ‌డం మాత్రం తీర‌ని లోటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close