ఆ ద‌ర్శ‌కుడు ‘క‌మీష‌న్’ ఏజెంటైపోయాడు

కక్కుర్తి అంటే ఇదే. సినిమాకి ఎలాగూ పారితోషికాలు వ‌స్తాయి. సినిమా హిట్ట‌యితే… అవ‌కాశాలు పెరుగుతాయి. దానికి తోడు పారితోషికాలూ భారీగా వ‌స్తాయి. కానీ ఓ ద‌ర్శ‌కుడు మేకింగ్ పై దృష్టి పెట్ట‌కుండా ‘క‌మీష‌న్లు’ లాక్కోవ‌డంపై శ్ర‌ద్ద పెట్టాడు. ఆయ‌న గారి య‌వ్వారం గురించి టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకుంటున్నారు. ఈమ‌ధ్య రెండు హిట్లు కొట్టిన ద‌ర్శ‌కుడు.. మూడో సినిమాని అట్ట‌ర్ ఫ్లాప్‌గా మ‌ల‌చ‌డంలో విజ‌య‌వంత‌మ‌య్యాడు. ఆ సినిమా కూడా స్టార్ హీరోతో తీసిందే. కాక‌పోతే.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర భారీగా ప‌ల్టీలు కొట్టి అంద‌రినీ నిరాశ ప‌రిచింది.
ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడిదే త‌ప్పు.. అంటూ అంద‌రూ ముక్త కంఠంతో నిందిస్తున్నారు. స‌రైన క‌థ‌, క‌థ‌నాలు ఎంచుకోని ద‌ర్శ‌కుడు… త‌న‌కొచ్చిన అవ‌కాశాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు.

హిట్లు, ఫ్లాపులు మామూలే. దానికి ఎవ‌రూ అతీతులు కారు. కాక‌పోతే ఈ ద‌ర్శ‌కుడు మాత్రం.. చేచేతులూ ప్లాఫ్ కొని తెచ్చుకున్నాడ‌ట‌. డ‌బ్బు పై వ్యామోహంతో క‌మీష‌న్ క‌క్కుర్తితో సినిమా మొద‌లై, పూర్త‌య్యేలోపు ‘గుంజుడు’ కార్య‌క్ర‌మంపైనే దృష్టి పెట్టాడ‌ని ఆ ప్ర‌భావం మేకింగ్ లోనూ ప‌డింద‌ని టాక్. ‘సినిమా ఇంత‌లో పూర్తి చేస్తా’ అని నిర్మాత ద‌గ్గ‌ర ఓ అంకెకి బేరం పెట్టాడ‌ట ఆ ద‌ర్శ‌కుడు. నిర్మాత ఇచ్చిన బ‌డ్జెట్‌లో కొంత మిగుల్చుకోవ‌డంతో పాటు, సాంకేతిక నిపుణుల‌కు ఇచ్చిన పారితోషికాల నుంచి ‘క‌మీష‌న్లు’ ద‌క్కించుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. సంగీతం, ఆర్ట్ విభాగాలకు ఇచ్చిన పారితోషికాల్లో ద‌ర్శ‌కుడికి కాస్త వాటా వెళ్లింద‌ని, త‌న చెప్పు చేత‌ల్లో ఉండేవాళ్ల‌నే టెక్నీషియ‌న్లుగా తీసుకున్నాడ‌ని స‌మాచారం. అలా… క‌మీష‌న్ పైనే ఎక్కువ దృష్టి పెట్ట‌డంతో… త‌న మూడో సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ముఫ్ఫై మూడు ప‌ల్టీలు కొట్టింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close