అంద‌రి క‌ళ్లూ.. ‘కాంతారా’ వైపే!

ఈమ‌ధ్య డ‌బ్బింగ్ చిత్రాల‌కు కాస్త ఊపు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. `విక్ర‌మ్‌` తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది.`పి.ఎస్ 1`కి మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఇప్పుడు అంద‌రి క‌ళ్లూ `కాంతారా` పై ప‌డ్డాయి. రిష‌బ్ శెట్టి న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కన్న‌డ సినిమా ఇది. అక్క‌డ సూప‌ర్ హిట్ట‌య్యింది. క‌న్న‌డ విమ‌ర్శ‌కులు దీన్ని ఓ క్లాసిక్ గా అభివ‌ర్ఱించారు. దాంతో మిగిలిన భాష‌ల్లో ఈ సినిమాని డ‌బ్ చేయాల‌న్న డిమాండ్ పెరిగింది. ఈమ‌ధ్య ఏ సినిమా అయినా అన్ని భాష‌ల్లోనూ నేరుగా ఒకేసారి విడుద‌ల చేస్తున్నారు.కానీ `కాంతారా`కే `మా భాష‌లో దీన్ని డ‌బ్ చేయండి` అంటూ అడిగి మ‌రీ చేయించుకొంటున్నారు. తెలుగులో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ విడుద‌ల చేస్తోంది. ఈ శుక్ర‌వార‌మే విడుద‌ల అవుతోంది. తెలుగులో ఈ సినిమా చూడాల‌ని చాలామంది ఎదురు చూస్తున్నారు. టాక్ ఎలాగూ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది కాబ‌ట్టి.. వ‌సూళ్లు బాగానే ఉండే అవ‌కాశాలున్నాయి. రిష‌బ్ శెట్టికి తెలుగులో మార్కెట్ లేదు. చాలామందికి రిష‌బ్ ఎవ‌రో తెలీదు. త‌ను న‌టించిన `బెల్ బోటెమ్‌` ఆహాలో వ‌చ్చింది కానీ.. థియేట‌ర్లో విడుద‌ల కాలేదు. అదొక్క‌టే ఈ సినిమాకి మైన‌స్‌. కాక‌పోతే ఈవారం తెలుగులో పెద్ద‌గా సినిమాలేం రావ‌డం లేదు. దీపావ‌ళికి మాత్రం జోరుగా సినిమాలొస్తున్నాయి. ఈ గ్యాప్‌ని `కాంతారా` క్యాష్ చేసుకొనే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close