లీకులు మొద‌ల‌య్యాయి:  పెద్ద సినిమాలూ పారాహుషార్‌!

ఈకాలంలో దేన్నీ కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నాం. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని – లీకులు ఎక్కువైపోయాయి. సినిమాకి సంబంధించిన అంశాలైతే మ‌రీనూ. చిత్ర‌బృందం చెప్ప‌క ముందే టైటిళ్లు తెలిసిపోతున్నాయి. క‌థ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. కాంబినేష‌న్లా… స‌రేస‌రి. ఇవ‌న్నీ ఎందుకు..?  ఏకంగా సినిమాలో స‌న్నివేశాలే లీకైపోతున్నాయి. `అత్తారింటికి దారేది` ఎపిసోడ్ మ‌ర్చిపోయేదేం కాదు. ఏకంగా స‌గం సినిమా హెచ్ డీ ప్రింట్ తో లీకైపోయింది. ఈ ఎఫెక్ట్ తో అంద‌రూ జాగ్ర‌త్త ప‌డ్డారు. సెట్లో క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల్ని అమ‌లు చేసి, లీకు వీరుల్ని కంట్రోల్ చేయ‌గ‌లిగారు. అదంతా కొంత కాల‌మే. ఇప్పుడు లీకుల సీజ‌న్ మ‌ళ్లీ మొద‌లైన‌ట్టు అనిపిస్తోంది.

మొన్న‌.. `సర్కారు వారి పాట‌` టీజ‌ర్ నే తీసుకోండి. మ‌హేష్ పుట్టిన రోజున ఉద‌యం 9 గంట‌ల‌కు విడుద‌ల కావాల్సిన టీజ‌ర్‌. అర్థ‌రాత్రి హ‌డావుడిగా రిలీజ్ చేశారు. ఎందుకంటే.. ఆ టీజ‌ర్ ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దాంతో చిత్ర‌బృందం అప్ర‌మ‌త్త‌మై డామేజ్ కంట్రోల్ చేయ‌డంలో భాగంగా ఆ ప‌ని చేసింది. ఇప్పుడు `పుష్ష‌` వంతు వ‌చ్చింది. ఈ సినిమాలోని తొలి పాట‌ని ఈరోజు (ఆగ‌స్టు 13)న విడుద‌ల చేయాలి. అయితే.. అనుకోకుండా… ఒక రోజు ముందే ఈ పాట బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దేవిశ్రీ ప్ర‌సాద్ టోన్ లో ఈ పాట‌ని ఇప్ప‌టికే చాలామంది వినేశారు. ఇదీ లీకు వీరుల ప‌నే. పోస్ట‌ర్లు, లుక్కుల వ‌ర‌కూ లీకైనా పెద్ద‌గా ఎఫెక్ట్ ఉండ‌దు. టీజ‌ర్లూ, పాట‌లూ ముందే వ‌చ్చేస్తున్నాయంటే ఒక‌సారి ఆలోచించుకోవాల్సిందే. ఈ సీజ‌న్‌లో చాలా పెద్ద సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌, ఆచార్య‌, అఖండ‌, రాధే శ్యామ్.. ఇలా ఆ లిస్టు చాలా పెద్ద‌దే ఉంది. ఈ సినిమాల‌కూ ఇలాంటి ప‌రిస్థితే ఎదురు అయితే… `అధికారిక విడుద‌ల‌` అనే పేరుకి అర్థ‌మే లేకుండా పోతుంది. కొంత‌మంది కావాల‌ని లీక్ చేసి, త‌మ సినిమాల‌కు హైప్ తీసుకొద్దామ‌ని చూస్తుంటారు. కాక‌పోతే.. పెద్ద సినిమాల‌కు ఆ అవ‌స‌రం ఉండ‌దు. లీకు వీరుల్ని ఎవ‌రో క‌నిపెట్టి, వాళ్ల‌కు చెక్ పెట్టాల్సిన బాధ్య‌త పెద్ద సినిమాల‌పై ఉంది. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close