క‌రోనాతో నిర్మాత సోద‌రుడి మృతి

క‌రోనా ప‌డ‌గ చిత్ర‌సీమ‌పై ప‌డింది. ప్ర‌ముఖ నిర్మాత పోకూరి బాబూరావు సోద‌రు.. పోకూరి రామారావు క‌రోనా తో మృతి చెందారు. శుక్ర‌వారం రాత్రి ఆయ‌న క‌న్ను మూశారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న హోం క్వారెంటైన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. పోకూరి బాబూరావు ఈత‌రం ఫిల్మ్స్ లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్నిఅందించారు. ఆయ‌న సోద‌రుడు ఇప్పుడ క‌రోనా తో మ‌ర‌ణించ‌డం చిత్ర‌సీమ‌ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పోకూరి కుటుంబ స‌భ్యుల‌కు సైతం క‌రోనా టెస్టులు చేయించిన‌ట్టు తెలుస్తోంది. అయితే… వాళ్లంతా ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు.

బుల్లి తెర న‌టీన‌టులు క్ర‌మంగా క‌రోనా బారీన ప‌డుతున్నారు. ప్ర‌భాక‌ర్ అనే బుల్లి తెర న‌టుడికి క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఆత‌ర‌వాత న‌వ్యాస్వామి క‌రోనా బారీన ప‌డింది. ఇప్పుడు ర‌వికృష్ణ అనే న‌టుడికీ క‌రోనా పాజిటీవ్ అని తేలింది. `ఆమె క‌థ‌`లో న‌వ్యాస్వామితో క‌ల‌సి న‌టిస్తున్నాడు ర‌వికృష్ణ‌. ఆ షూటింగ్ లో ఉండ‌గానే న‌వ్య‌కి క‌రోనా పాజిటీవ్ అని తెలిసింది. ఆ త‌ర‌వాత ర‌వికృష్ణ‌కీ టెస్టులు చేయించారు. ర‌వికృష్ణ `బిగ్ బాస్ 3`లోనూ క‌నిపించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close