అమెరికాలో తెలుగు కథానాయికల చీకటి భాగోతాలు: తెర వెనుక ఇంకెన్నో కధలు!

పైన మెరుపులు… లోపల చీకటి జీవితాలు. ఆ మిలమిలలు చెదిరిపోతే? లోపలున్న నిజ స్వరూపాలు బయటపడతాయి. సినిమా పరిశ్రమ, అందులోని వ్యక్తులు, మరీ ముఖ్యం గా కథానాయికల వ్యక్తిత్వాలంటే ఓ రకమైన చులకన భావం జనాలకు. కొంత మంది కథానాయికల వ్యక్తిగత జీవితాల గురించి తెలిశాక “వీళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేస్తారేమో ” అనే భావం కలుగుతుంది. ఈ భావాన్ని అప్పుడప్పుడు పరిస్థితులు, సంఘటనలు కూడా నిజం చేస్తూ ఉంటాయి. డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే నీచమైన వ్యాపారం లో కొంతమంది కదానాయికలకూ భాగముంది అని తెలిస్తే… ఆధారాలతో సహా బయటపడితే. ముందు ఆశ్చర్యపోయి, ఆ తరవాత ‘మరీ ఇంత దిగజారి పోయారేంటి” అని బాధ పడాల్సి వస్తుంది. ఈ చీకటి మాటు వ్యవహారాలు ఇంకెన్ని సాగుతున్నాయో అంటూ నీతి గా నిజాయితీగా బతుకుతున్న వాళ్ళ ని కూడా అనుమానంగా చూడాల్సి వస్తుంది.

ఐతే ఈ చీకటి మాటు వ్యాపారం ఇప్పుడు దేశాలు దాటి, ఖండాలు దాటి, అగ్ర రాజ్యమైన అమెరికా వరకూ విస్తరించింది. అక్కడ చాలా ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ శరీర వ్యాపారాన్ని ఎట్టకేలకు చికాగో పోలీసులు వలపన్ని ఛేదించారు. ఈ ఆపరేషన్ లో కొన్ని విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి.

కృష్ణ మోదుగుముడి, చంద్ర మోదుగుముడి అనే భార్యాభర్తలు ఈ సెక్స్ రాకెట్ కి కర్త, కర్మ, క్రియ. వీళ్లకు కొంతమంది టాలీవుడ్ కథానాయికలతో సన్నిహిత సంబంధం ఉంది. తాత్కాలిక వీసాలు సంపాదించి. కాన్ఫిరెన్స్ లు, అవార్డు ఫంక్షలు, షూటింగులు పేరుతో వాళ్ళని అమెరికా రప్పిస్తారు. అప్పటికే ఎవరిని ఏ హోటల్ కి పంపాలి. అక్కడ ఎన్ని రోజులు ఉంచాలి అనేది ముందే ఫిక్స్ అయిపోతుంది. ఒకొక్క కస్టమర్ నుంచి దాదాపు 3 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసి డీల్ కుదురుస్తారు. వీళ్లపై అక్కడి పోలీసులకు ఎప్పటి నుంచో కన్ను ఉంది. దాదాపు 6 నెలల పాటు నిఘా ఉంచి, స్పష్టమైన ఆధారాలతో ఈ సెక్స్ రాకెట్ ని రెడ్ హేండెడ్ గా పట్టుకున్నారు. సెల్ ఫోన్స్, అందులోని వాయిస్ కాల్స్, వాట్స్ ఆప్ సందేశాలు ఇవన్నీ బయటకి తీస్తే… టాలీవుడ్ లోని చిన్న చిన్న హీరొయిన్స్ పేర్లు బయటికి వచ్చాయి. ఐతే వీళ్లంతా ఓ మోస్తరు వాళ్లే. బయటకి రాని పెద్ద తలకాయలు వీటిలో చాలా వున్నాయి. తమ అంద చందాలతో, అభినయం తో మనసు దోచుకున్న కథానాయికల బాగోతాలు బయటికి రానివి, ఈ దొరకని దొంగల భాగోతాలు చదవండి.

ఓవరసీస్ లో ఇలాంటివి మాములే అని, అవార్డు ఫంక్టన్ లకు అతిధులుగా, ఆ వేదికలపై డాన్సులతో మైమరపించే వాళ్లలో కొంతమంది “సైడ్ బిజినెస్” గా ఈ వ్యాపారం కూడా చేసుకుని రెండు చేతులా సంపాదిస్తున్నారని అక్కడి శోధనలో తేలింది. ఇప్పటి వరకూ ఏ కేసులోనూ బయటికి రాకపోయినా, ఏ సెక్స్ రాకెట్ లోను దొరక్క పోయినా. .కొంత మంది భామల బాగోతాలు అక్కడ బహిరంగ రహస్యాలే.

అందులో ఫేడ్ అయిపోయిన హీరోయిన్లు, ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటున్న వాళ్ళు, ఎన్నో కొన్ని సినిమాలతో బిజి గా ఉన్న వాళ్ల పేర్లు ఇందులో ఉన్నాయి. వాళ్ళల్లో కొన్ని పేర్లు…

హీరోయిన్ 1:

చిన్న చిన్న హీరోల సినిమాలు చేస్తూ, ఒక్కసారిగా స్టార్ హీరోల పక్కన సెకండ్ హీరోయిన్ గా ప్రమోషన్ తెచ్చుకుని, బాపు గారి బొమ్మ అనిపించుకున్న మూడు అక్షరాల పేరున్న ఓ కథానాయిక.

హీరోయిన్ 2:

ఈ తరం యంగ్ హీరోయిన్లు అందరితోనూ ఓ రౌండ్ కొట్టేసి, సాయి ధరమ్, సందీప్ కిషన్ లాంటి వాళ్ళతో రెండేసి సినిమాలు చేసి, వాళ్ళ కి కలిసొచ్చిన నాయిక మనిపించుకుని, ఇప్పుడు అవకాశాలు లేక డల్ అయిపోయిన మరో మూడక్షరాల పేరున్న భామ.

హీరోయిన్ 3:

దేశాల మధ్య వేసుకోవాల్సిన కంచెలు మనుషుల మధ్య వేసుకోకూడదు అనే గొప్ప కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఆ తరవాత ఎన్ని సినిమాలు చేసినా ఒక్క హిట్టు కూడా దక్కించుకోకుండా, ఇటీవల ఓ దర్శకుడి విడాకులకు పరోక్ష కారణం అనిపించుకున్న పొడుగు కాళ్ళ భామ.

హీరోయిన్ 4:

తెలుగమ్మాయి అయిన పాపానికి నాకు తెలుగులో అవకాశాలు రాలేదు అని ఇటీవల మీడియా ముందు మొత్తుకుని, కాస్టింగ్ కౌచ్ గురించి స్పీచు లు దంచికొట్టిన 5 అక్షరాల పేరున్న ఓ ఔట్ డేటెడ్ హీరోయిన్.

హీరోయిన్ 5:

రాజకీయాల్లో సేనానిగా మారిన ఒక హీరో సినిమాలో ఓ చిన్న పాత్ర వేసి, ఆ తరవాత ఏకంగా ఆయన పక్కనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి, ఆ వెంటనే ఆ సినిమాలో తన స్థానాన్ని కోల్పోయిన ఓ దురదృష్ట నాయిక

హీరోయిన్ 6:

తరుణ్, వరుణ్ సందేశ్, జగపతిబాబు లాంటి వాళ్ళతో నటించి ఇప్పుడు కనుమరుగైన ఓ కథానాయిక.

సైడ్ క్యారెక్టర్:

వెంకటేష్ నటించిన ఓ సినిమాలో కథానాయిక చెల్లాయి పాత్రలతో వెండితెరపై అల్లరి చేసి, ఇప్పుడు బుల్లి తెరకు షిఫ్ట్ అయిన నటి

యాంకర్:

అనసూయ, రష్మీ లాంటి టాప్ యాంకర్లకు పోటీగా తయారై, బుల్లితెర షోలకే వన్నె తెస్తున్న ఓ నవతరం యాంకర్

ఇలా ఓ 7-8 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అరెస్టు అయిన వేరే (చిన్న ఆర్టిస్టుల) గ్యాంగ్ ని చూసి పెద్ధ దొంగల గ్యాంగ్ కొన్నాళ్ళ పాటు అమెరికా లో ఈ వ్యాపారానికి బహు దూరంగా ఉండడమో, చాలా జాగ్రత్త గా చెయ్యడమొ జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com