టాలీవుడ్ కి నాన్నలు కావలెను !

మదర్, ఫాదర్ సెంటిమెంట్. వెండితెరపై సూపర్ హిట్ ఫార్ముల. గతంలో ఈ ఫార్ముల చుట్టూ కధలు తిరిగేవి. తన తల్లితండ్రులకు జరిగిన అన్యాయం తెలిసి విలన్లపై తిరగబడతాడు హీరో. ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా కధలు ఘన విజయాలు సాధించాయి. తర్వాత కాలంలో మదర్ సెంటిమెంట్ పై ఎక్కువ ఫోకస్ చేశారు సినీ రూపకర్తులు. ఈ ఫార్మల కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. తల్లి పాత్రను గ్లోరీఫై చేసి హీరోయిజం ను ఎలివేట్ చేసేలా కధలు తయారుచేసి హిట్లు కొట్టారు. ఇదీ పాత బడిపోయింది.

అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండీగా ఫాదర్ సెంటిమెంట్ పై కధలను కాయిన్ చేస్తున్నారు ఇప్పటి దర్శక రచయితలు. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫాదర్ రోల్స్ ను ఎలివేట్ చేస్తూ సినిమాలు వస్తున్నాయి. ‘బొమ్మరిల్లు’ తీసుకోండి. ఆ సినిమాకి కీలకం ప్రకాష్ రాజ్ పాత్రే. అలాగే కొత్త బంగారు సినిమా విషయానికి వస్తే.. ప్రకాష్ రాజ్ రోల్ లేకపోతే.. ఆ సినిమా చాలా సదాసీదా గా వుండేది. ఒకప్పుడు తండ్రి పాత్రలు అంటే ఆ కాస్త నెమ్మదిగా సాగేవి. చాలా సాదాసీగా వుండేది. జగ్గారావు, రావు గోపాల్ రావు, సత్యనారయణ, గుమ్మడి.. లాంటి నటులు వేసిన తండ్రిపాత్రలు సగటు తండ్రిపాత్రకే పరిమితమయ్యేవి. అయితే ఇప్పటి దర్శక, రచయితలు ట్రెండ్ కు తగ్గట్టు కావాల్సిన హీరోయిజంను తండ్రి పాత్ర చుట్టూ అల్లుతున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకరచయిత ఏకంగా తండ్రి పాత్రను టైటిల్ రోల్ గా చేసుకొని ‘సన్ అఫ్ సత్యమూర్తి’ చూపించారు. సుకుమార్ ‘నాన్నకు ప్రేమ’తో అంటూ మరో ఫాదర్ సెంటిమెంట్ కధ చెప్పాడు. పటాస్, సుప్రీం.. ఇలా చెప్పుకుంటూ పొతే ఈ మధ్యకాలంలో ఫాదర్ రోల్స్ ను బేస్ చేసుకొని చాలా కధలు వచ్చాయి. సరిగ్గా చూపించాలే కానీ ఫాదర్ సెంటిమెంట్ ప్రెజెంట్ జనరేషన్ కు కనెక్ట్ అయ్యే ఫార్ముల. ఇందులో బలమైన హీరోయిజం చూపించే కధలు సృస్టించవచ్చు. అలాంటి బలమైన కధలు రాసే సత్తా మన రైటర్స్ కు వుంది. కాని ఇక్కడ ఒకటే సమస్య. నటుల కొరత. పైన చెప్పుకున్న సినిమాలు ఒకసారి చూసుకుంటే అందులో సగంకు పైన చిత్రాల్లో నాన్నగా ప్రకాష్ రాజే కనిపిస్తారు. ఇలా ఎంతని ప్రకాష్ రాజ్ నే చూపిస్తారు. ఈ విషయంలో విసుగొచ్చిందని ఆయనే ఓ సందర్భంలో ఓపెన్ అయ్యారు.

రావు రమేష్, మురళి శర్మ, రాజేంద్రప్రసాద్, సంపత్ లాంటి నటులు ఇప్పుడు ఫాదర్ రోల్స్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు. అయితే వీళ్ళకి కొన్ని బౌండరీలు వున్నాయి. ఆ బౌండరీలకు తగ్గటే తండ్రి పాత్ర వుటుంది. అలా కాకుండా.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ , నాగార్జున, శ్రీకాంత్.. లాంటి సినియర్ హీరోలు కనుక తండ్రిపాత్రలకు ఓకే చెబితే మాత్రం రచయితల పెన్ను కొత్త దారిలో వెళుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పైన చెప్పిన స్టార్లంత ఎదో ఒక సినిమాలో తండ్రి పాత్రను చేసిన వారే. అయితే అది ఫుల్ లెంత్ తండ్రి పాత్ర కాదు. డబల్ యాక్షన్ లో తండ్రి కొడుకు రెండు పాత్రలను తానే పోషించి ఇమేజ్ బ్యాలన్స్ చేసే టైపు పాత్రలు ధరించారు తప్పితే.. ఒక తండ్రిగా కనిపించడానికి ఇష్టపడలేదు. వాస్తవానికి తండ్రిపాత్రలలో కనిపించడానికి ఇది సరైన సమయమే. అందరికీ తెలిసన విషయమే.. పైన చెప్పిన హీరోలందరికి కుమారులు వున్నారు. ఆ కుమారులు హీరోలు కూడా అయిపోయారు. అయితే తండ్రులు మాత్రం ఇంకా మాస్ చట్రంలో ఇరుక్కొని వయసుపై బడిపోయినా డుయట్లు పాడుకోవడానికే మొగ్గుచుపుతున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సరైన కధ కుదిరితే ఎలాంటి పాత్రకైనా సిద్ధం అవుతారు. కాని మన దగ్గర ఆ దిశగా ఆలోచన చేయడంలేదు. మొన్న నాగార్జున మాట్లాడుతూ.. ఇప్పట్లో తండ్రిగా కనిపించే అవకాశం లేదని ప్రకటించేశారు. మెగాస్టార్ గురించి చెప్పక్కర్లేలేదు. వెంకటేష్, శ్రీకాంత్ లు కూడా ఆ దిశగా అలోచించడం లేదు. ఒక వేళ వీరంతా తండ్రిపాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనుక.. మరిన్ని కొత్త కధలు , మల్టీస్టారర్లు చూడొచ్చు. మరీ సినియర్ స్టార్లు ఆ దిశగా ఎప్పుడు అడుగులు వేస్తారో..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.