ఉప‌శ‌మ‌నం: పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి గ్రీన్ సిగ్న‌ల్‌

చిత్ర‌సీమ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త‌. లాక్ డౌన్ వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ రెడ్ సిగ్న‌ల్ ప‌డింది. షూటింగులు ఎప్పుడు మొద‌లెట్టినా, ప్ర‌స్తుతానికి పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని చిత్ర‌సీమ కోరుకుంటోంది. ఈ విష‌య‌మై… మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌ని క‌లుసుకుని త‌మ బాధ‌ల్ని చెప్పుకున్నారు నిర్మాత‌లు.

ఇప్పుడు ప్ర‌భుత్వం నుంచి కూడా సానుకూల స్పంద‌న ల‌భించింది. ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని చిరంజీవి నివాసంలో సినీ ప్ర‌ముఖుల‌తో మంత్రి భేటీ వేశారు. ఈ సంద‌ర్భంగా షూటింగులు, పోస్ట్ ప్రొడ‌క్షన్‌ల అనుమ‌తుల‌పై చ‌ర్చ జ‌రిగింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేసుకోవ‌డానికి త‌మ‌కేం అభ్యంత‌రం లేద‌ని మంత్రి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు స్ప‌ష్టం చేశారు. షూటింగుల అనుమ‌తి విష‌యంలో త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌ని హామీ ఇచ్చారు. బ‌హుశా జూన్ 1 నుంచి షూటింగుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే… సెట్లో ఎంత మంది ఉండాలి? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? అనే విష‌యంపై ప్ర‌భుత్వం ఇచ్చే స్ప‌ష్ట‌మైన గైడ్ లైన్స్‌ని పాటించాల్సివుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close