తెలుగు చానళ్లలో పోటాపోటీ ఇంటర్యూలు..! టీఆర్పీ రేసా..? రాజకీయమా..?

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఎన్నికల వేడికి తెలుగు మీడియా చానళ్లు… ట్యూన్ అవుతున్నాయి. ప్రధాన పార్టీల ప్రముఖ నేతల ఇంటర్యూలను ప్రసారం చేసేందుకు … పోరాటపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. వైఎస్ జగన్‌ ప్రత్యేక ఇంటర్యూ అంటూ ఓ చానల్ మూడు రోజుల ముందు నుంచే.. హడావుడి చేసింది. ప్రొమోలు వేసి..భారీ పబ్లిసిటీ చేసింది. ఆ తర్వాత ఇంటర్యూ టెలికాస్ట్ చేసింది. అదే సమయంలో టీఆర్పీల్లో నెంబర్‌వన్‌గా ఉండే మరో చానల్‌… టీడీపీలో పవర్ సెంటర్‌గా ఉన్న నారా లోకేష్ ఇంటర్యూను తెరపైకి తీసుకు వచ్చింది. రెండు చానళ్లు తమ తమ ఇంటర్యూలను హైలెట్ చేసుకున్నాయి.

అయితే… చానళ్ల ప్రయత్నాలన్నీ టీఆర్పీల కోసమేనా..? పోటీ చానల్ చేస్తుందని… తాము కూడా చేస్తున్నారా..? అంటే… కానే కాదని చెప్పాలి. టీఆర్పీలకు మించిన రాజకీయం అందులో ఉందని కచ్చితంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే… జరిగిపోయిన బిగ్ బాస్‌ ఎపిసోడ్‌లో ఎవరు ఏం చేశారు.. అన్నదానిపై అరగంట పాటు విశ్లేషించుకుంటే వచ్చే టీఆర్పీ.. పొలిటికల్ ప్రోగ్రామ్ ఎయిర్ చేస్తే రాదు. ఇంటర్యూలు టెలికాస్ట్ చేస్తే అస్సలు రాదు. ఈ విషయం మీడియా వర్గాలకు తెలుసు. కానీ టీవీ చానళ్లు ఇంటర్యూలకు ప్రాధాన్యం ఇవ్వడానికి అంతకు మించిన కారణాలుంటాయి.

తెలుగు మీడియాలోని కొన్ని మినహా ప్రధాన చానళ్లు అన్నీ.. ఏదో ఓ పార్టీ ట్యాగ్‌ను మోస్తూ ఉంటాయి. కానీ ఏ చానల్ కూడా… తాము ఫలానా పార్టీకి మద్దతిస్తున్నామని చెప్పుకోదు. ఆ చానల్ చేసే ప్రసారాలను బట్టి.. తీసుకునే వార్తలను బట్టి ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి. జగన్ ఇంటర్యూను ప్రసారం చేసిన ఎన్టీవీ… వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పక్షం అని మెజార్టీ నమ్ముతారు. గత ఎన్నికలకు ముందు… టీడీపీని టార్గెట్ చేసి.. సర్వేలు ప్రసారం చేసి.. జగన్‌ను సంతృప్తి పరిచింది. అసలు వాస్తవ సర్వేలను పక్కన పెట్టి.. వైసీపీ గెలుస్తుందని చెప్పేసింది. ఆ తరవాత కూడా.. టీడీపీపై ఆ తరహా ప్రచారం చేసింది. కానీ తెర వెనుక ఏం జరిగిందో కానీ కొంత కాలం తన వైఖరి మార్చుకుంది. ఇప్పుడు జగన్‌కు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో సపోర్ట్ చేస్తోంది.

ఇక లోకేష్‌ ఇంటర్యూని ప్రసారం చేసిన మరో టీవీ చానల్ యాజమాన్యానికి కులం అంటగట్టి… టీడీపీని సపోర్ట్ చేస్తుందని చెబుతూంటారు. కానీ ఆ చానల్ చూసేవారికి అలాంటి ఫీలింగ్ మరీ అంత తేడాగా రాదు. కానీ… జగన్ ఇంటర్యూ పోటీ చానల్లో వస్తున్న సమయంలోనే… ఆ టీవీ చానల్‌ కూడా లోకేష్ ఇంటర్యూని హైలెట్ చేసిందంటే.. తెర వెనుక ఏదో జరిగి ఉంటుందని.. భావిస్తున్నారు. నిజానికి కులం పేరుతో .. టీడీపీకి సపోర్ట్ చేస్తుందని విశ్లేషించేవారు.. జగన్‌కు అండగా నిలుస్తున్న.. చానల్ అధినేత సామాజికవర్గాన్ని మాత్రం ప్రస్తావించారు. ఎందుకంటే ఆయనదీ అదే కులం. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. మీడియాలోనూ స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తమ బలాన్ని చూపించుకోవడానికి… ఎవరికి వారు… ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇది ముందు ముందు మరింతగా పెరగనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close