’96’ రీమేక్‌: మ‌ళ్లీ త్రిష‌నే తీసుకొస్తారా??

’96’ రీమేక్ పై దిల్‌రాజు గ‌ట్టిగా దృష్టి పెట్టారు. ఈ సినిమాని తెలుగులో అర్జెంటుగా రీమేక్ చేయాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి – త్రిష జంటగా న‌టించిన చిత్ర‌మిది. అక్క‌డ‌… సంచ‌ల‌న విజయం సాధించింది. తెలుగు హ‌క్కుల్ని దిల్‌రాజు చేజిక్కించుకున్నారు. నాని, అల్లు అర్జున్ లాంటి క‌థానాయ‌కుల పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. చివ‌ర‌కు…. గోపీచంద్ ద‌గ్గ‌ర ఆ అన్వేష‌ణ ఆగింది. 96 రీమేక్‌లో న‌టించ‌డానికి గోపీచంద్ అంగీకారం తెలిపిన‌ట్టు స‌మాచారం. క‌థానాయిక‌గా మ‌ళ్లీ త్రిష‌నే తీసుకురావాల‌ని భావిస్తున్నార్ట‌. `96`లో త్రిష చాలా స‌హ‌జంగా న‌టించింది. ఆమె న‌ట‌న‌… విజ‌య్ సేతుప‌తితో పండిన కెమిస్ట్రీ… ఈ సినిమాని నిల‌బెట్టాయి. త్రిష‌లా మ్యాజిక్ చేసే క‌థానాయిక‌.. తెలుగులో క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ ఈ పాత్ర కోసం త్రిష‌నే సంప్ర‌దిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాక‌పోతే.. తెలుగులో త్రిష మార్కెట్ మ‌రీ దారుణంగా ఉంది. త్రిష‌ని దాదాపుగా ఫేడ‌వుట్ అయిన క‌థానాయిక‌ల జాబితాలో క‌లిపేశారంతా. ఈమ‌ధ్య త్రిష చేసిన సినిమాలేవీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. డ‌బ్బింగ్‌రూపంలో వ‌చ్చిన సినిమాల్నీ అస్స‌లు ఆద‌రించ‌లేదు. ఈనేప‌థ్యంలో త్రిష ఎంపిక మార్కెట్ ప‌రంగా.. ఎలాంటి ప్ర‌భావాన్ని చూపిస్తుంది? అనే ఆలోచ‌న‌లో ఉన్నారు దిల్‌రాజు. మ‌రోవైపు గోపీచంద్‌కీ స‌రైన విజ‌యాలు లేవు. ఫ్లాప్ బాట‌లో ఉన్న ఇద్ద‌ర్ని పెట్టుకుంటే… ఈ సినిమా ఎలా క్రేజ్‌తెచ్చుకుంటుంది? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కాక‌పోతే… దిల్‌రాజు లాంటి వ్య‌క్తులు క‌థ‌ని మాత్ర‌మే న‌మ్ముతారు. 96 క‌థ‌పై దిల్‌రాజుకి అపార‌మైన న‌మ్మ‌కం. స్టార్స్ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో.. అందుబాటులో ఉన్న తార‌ల‌తో ఈ రీమేక్ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు. మరి చివ‌రకు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close