సూర్య కోసం త్రివిక్ర‌మ్ కూడా!

సూర్య తెలుగులో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని, దానికి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు త్రివిక్ర‌మ్ సైతం సూర్య కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. నిజానికి ఇదివ‌ర‌కెప్పుడో ఈ కాంబినేష‌న్ గురించిన చ‌ర్చ సాగింది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. సూర్య‌కూడా చాలాసార్లు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. `త్రివిక్ర‌మ్ తో చేయాల‌ని వుంది.. క‌థ కుదిరితే త‌ప్ప‌కుండా చేస్తా` అని చెప్పాడు కూడా. అచితూ టాలీవుడ్ లోని టాప్ హీరోలంతా త్రివిక్ర‌మ్ వెంట ప‌డ‌డంతో అది కుద‌ర్లేదు. ఇప్పుడు అందుకు మార్గం సుగ‌మం అయ్యింద‌ని తెలుస్తోంది. సూర్య కోసం త్రివిక్ర‌మ్ ఓ క‌థ సిద్ధం చేశార్ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఆ త‌ర‌వాతి సినిమా సూర్య‌తోనే అని స‌మాచారం. అటు బోయ‌పాటి, ఇటు త్రివిక్ర‌మ్.. వీరిద్ద‌రూ సూర్య‌తో సినిమాలు చేయ‌డం దాదాపుగా ఖాయం. అయితే.. ఎవ‌రిది ముందు? ఎవ‌రిది త‌ర‌వాత‌? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close