దిల్ రాజు నిర్మాణం లో త్రివిక్రమ్ భారీ చిత్రం

అటు ప్రేమ కథలు ఇష్ట పడే యువతను ఇటు కుటుంబ కథా చిత్రాలను ఇష్ట పడే ప్రేక్షకులను ఆకట్టుకునే విధం గా కథలను రూపొందించుకుని , చక్కటి చిత్రాలను తీయటం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ది అందెవేసిన చేయి.ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ‘అ.. ఆ ‘ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే.

ఇదే విషయాన్నీ ప్రస్థావిస్తూ , ఉత్తమ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు త్రివిక్రమ్ తో ఒక భారీ చిత్రాన్ని ప్రకటించారు. ఒక పెద్ద స్టార్ హీరో తో ఈ చిత్రం ఉంటుంది అని , ఇతర వివరాలను తరువాత ప్రకటిస్తాం అని ఆయన తెలిపారు.

” త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నాకు ‘నువ్వే కావాలి’ సినిమా రోజుల నుండి మంచి స్నేహం ఉంది. సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మా బ్యానర్ లో ఆయన తో ఒక భారీ సినిమా తేయబోతున్నాం ” అని అన్నారు.

అ..ఆ చిత్రం విజయం గురించి మాట్లాడుతూ, “జూన్ లో పెద్ద సినిమా సక్సెస్ అయిన చరిత్ర లేదు. అటువంటి ట్రెండ్ ని కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది. కేవలం ఒక వారం లో డిస్ట్రిబ్యూటర్ ల కు డబ్బులు తిరిగి రావటం అనేది ఈ మధ్య కాలం లో ఏ సినిమా కి జరగలేదు. ఇంతటి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ కి , మా ప్రొడ్యూసర్ చినబాబు గారికి నా అభినందనలు” అని అన్నారు.

ఈ నూతన చిత్రం వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com