మ‌ళ్లీ నిరాశ ప‌రిచిన త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ మాట‌లే కాదు, స్పీచులు కూడా భ‌లే బాగుంటాయి. అత్తారింటికి దారేది, స‌న్నాఫ్‌స‌త్య‌మూర్తి, అ.అ.. ఈసినిమాల స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ ఇచ్చిన స్పీచులు అభిమానులు మ‌ళ్లీ మ‌ళ్లీ వింటుంటారు. ఓసారి సిరివెన్నెల గురించి మాట్లాడిన మాట‌ల‌కైతే – యూ ట్యూబ్‌లో బోలెడ‌న్ని హిట్స్ ఉన్నాయి. `అర‌వింద స‌మేత‌`కీ మాట‌ల మాంత్రికుడు స్పీచులు దంచేస్తాడ‌ని అనుకున్నారు. అయితే… అలా అనుకున్న‌వాళ్లంద‌రికీ షాక్ ఇచ్చాడు త్రివిక్ర‌మ్‌. `అర‌వింద‌` ప్రీ రిలీజ్‌లో అస్స‌లు మాట్లాడ‌లేదు. దానికి కార‌ణాలు రెండు. అప్ప‌టికే `అజ్ఞాత‌వాసి` అనే డిజాస్ట‌ర్ మోస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. `మాట‌లతో కాదు చేత‌ల‌తో చూపించాలి` అన్న నిర్ణ‌యానికి వ‌చ్చి త్రివిక్ర‌మ్ సైలెంట్ అయ్యి ఉండొచ్చు. మ‌రోవైపు వేదిక‌పై ఉన్న‌వాళ్లంతా హ‌రికృష్ణ‌ని స్మ‌రించుకుంటూ.. అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని క‌న్నీటి ప‌ర్యంతం చేశారు. అందుకే త్రివిక్ర‌మ్ లాంటి వాడు కూడా అక్క‌డ మాట‌లు వెదుక్కున్నాడేమో అనిపించింది.

పోనీ స‌క్సెస్ మీట్లో త్రివిక్ర‌మ్ తెగ మాట్లాడేస్తాడేమో అనుకున్నారు. కానీ అదీ తుస్సే అయ్యింది. రెండంటే రెండు ముక్కులు మాట్లాడి `మ‌.మ‌` అనిపించాడు త్రివిక్ర‌మ్‌. హిట్టొచ్చి, త్రివిక్ర‌మ్ గ‌త చిత్రాల రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్నా – త్రివిక్ర‌మ్ మౌనాన్నే ఆశ్ర‌యించ‌డం అభిమానుల్ని నిరాశ ప‌నిచేదే. బ‌హుశా.. ఈ సినిమాకి వ‌సూళ్ల‌తో పాటు కొన్ని విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. క‌థ‌లో కొత్త‌ద‌నం లేద‌ని, వేంప‌ల్లి గంగాధ‌ర్ లాంటి ర‌చ‌యిత‌ల క‌థ‌ల్లో్ంచి కీల‌క‌మైన అంశాల్ని త్రివిక్ర‌మ్ తెలివిగా దొంగిలించాడ‌ని ఎత్తి పొడుస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ సైలెంట్ అయిపోయాడేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close