మ‌హేష్‌.. త్రివిక్ర‌మ్.. ఇంకా చాలా దూరం

`స‌ర్కారు వారి పాట‌` త‌ర‌వాత‌… మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. నిజానికి గ‌త నెల 31నే ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు రావాలి. కానీ కుద‌ర్లేదు. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. త్రివిక్ర‌మ్ ఇంకా పూర్తి స్థాయిలో క‌థ త‌యారు చేయ‌లేద‌ట‌. మ‌హేష్ కి ఇంకా పూర్తి స్క్రిప్టుని వినిపించ‌లేద‌ని, ప్ర‌స్తుతం ఆ ప‌నిలోనే త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నాడ‌ని స‌మాచారం.

`అత‌డు` టైపులోనే… మ‌హేష్ కోసం ఓ లైన్ సిద్ధం చేశాడు త్రివిక్ర‌మ్‌. అత‌డులో… మ‌హేష్ ఓ క్రిమిన‌ల్. త‌ల దాచుకోవ‌డానికి ఓ ఇంట్లో మారు పేరుతో చ‌లామ‌ణీ అవుతుంటాడు. స‌రిగ్గా ఇలాంటి లైన్ తోనే మ‌హేష్ కోసం ఓ క‌థ అల్లుతున్నాడు త్రివిక్ర‌మ్. కాక‌పోతే.. ఇందులో మ‌హేష్ అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ అని స‌మాచారం. ఆ విష‌యం దాచి పెట్టి, ఓ ఇంట్లో ఉంటాడు. ఇదీ.. క్లుప్తంగా మ‌హేష్ కి త్రివిక్రమ్ చెప్పిన లైను. దానికి మ‌హేష్ కూడా ఓకే అన్నాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ పూర్తి స్థాయి స్క్రిప్టు త‌యారు కాలేదు. ఇంట్ర‌వెల్ ట్విస్టు, క్లైమాక్స్‌… ఇలా త్రివిక్ర‌మ్ రాసుకుంటూ వెళ్లాడు గానీ, మ‌ధ్య‌లో ఫిల్ చేయాల్సిన గ్యాపులు చాలానే ఉన్నాయ‌ని, ఇవ‌న్నీ పూర్త‌య్యేస‌రికి టైమ్ ప‌ట్టేలా ఉంద‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. పైగా.. మ‌హేష్ కీ అంత తొంద‌రేం లేదు. ముందు `స‌ర్కారు వారి పాట‌` పూర్త‌వ్వాలి. అది జ‌రగాలంటే… కోవిడ్ నిబంధ‌న‌లు స‌డ‌లించి, షూటింగుల‌కు అనుమ‌తి ఇవ్వాలి. ఈలోగా త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర కావ‌ల్సినంత టైమ్ ఉంది. అందుకే త్రివిక్ర‌మ్ కూడా రిలాక్డ్స్‌గా క‌థ గురించి ఆలోచిస్తున్నాడ‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close