త్రివిక్ర‌మ్ పోయి.. పోయి.. ఆ క‌థ తీస్తాడా??

త్రివిక్ర‌మ్ – వెంక‌టేష్ కాంబినేష‌న్ చిత్ర‌సీమ‌కు షాక్ ఇచ్చేదే. ఆల్మోస్ట్ ఈ కాంబోలో సినిమా రాదు అని ఫిక్స‌యిపోయిన త‌రుణంలో.. స‌డ‌న్ గా ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. త్రివిక్ర‌మ్ పంచ్‌ల‌కు, వెంకీ కామెడీ టైమింగ్‌కి ప‌ర్‌ఫెక్ట్ జోడీ కుదిరిపోతుంది కాబ‌ట్టి – ఈ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలు అదే స్థాయిలో పెర‌గ‌డం ఖాయం. అయితే… ఈ సినిమా ఓ రీమేక్ అని, ‘జాలీ ఎల్ ఎల్ బీ 2’ని తెలుగులో వెంకీతో తీయ‌బోతున్నార‌ని తెలిసి.. అంతే షాక్‌కి గుర‌వుతున్నారు సినీ జ‌నాలు.

కార‌ణం… జాలీ ఎల్ ఎల్ బీ తో పోలిస్తే. పార్ట్ 2 ఏమంత మెప్పించ‌లేదు. అక్షయ్ చేశాడ‌ని త‌ప్ప‌.. పెద్ద‌గా చెప్పుకోవ‌డానికి ఏం లేదు. క‌థ ప‌రంగా మెరుపులేం ఉండ‌వు. క‌థ‌నం కూడా అంతంత మాత్ర‌మే. కామెడీ పండిందీ త‌క్కువే. పోయి పోయి అలాంటి క‌థ‌ని తెలుగులో త్రివిక్ర‌మ్ ఎందుకు రీమేక్ చేస్తాడు??? అయితే హారిక హాసిని ద‌గ్గ‌ర జాలీ ఎల్ ఎల్ బీ 2 రైట్స్ ఉన్నాయి. వాళ్లు తీసుకొందీ వెంకీ కోస‌మే. వెంకీకి రీమేక్‌లంటే చాలా ఇష్టం. పైగా.. ఈ సినిమాని చాలా త‌క్కువ టైమ్‌లో, త‌క్కువ బ‌డ్జెట్ లో తీసేయొచ్చు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకొనే ఈ ప్రాజెక్టుని ఓకే చేశార‌ని తెలుస్తోంది. పాయింట్ అదే అయినా.. త్రివిక్ర‌మ్ త‌న‌దైన కామెడీ మిక్స్ చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. అయితే.. జాలీ ఎల్ ఎల్ బీ 2 ప‌ని.. త్రివిక్ర‌మ్ ఇంకా మొద‌లెట్ట‌లేదు. అజ్ఞాత‌వాసి పూర్త‌వ్వ‌గానే.. ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుంది. ఆ త‌ర‌వాత వెంకీ సినిమా ప‌నులు మొద‌ల‌వుతాయి. అప్ప‌టికి జాలీ ఎల్ ఎల్ బీ 2 ఇంకా పాత‌దైపోతుంది. ఈలోగా త్రివిక్ర‌మ్ ఆలోచ‌న‌లు మారే అవ‌కాశాలున్నాయి. వెంకీతో ఎప్పుడు సినిమా చేసినా… త‌క్కువ బ‌డ్జెట్‌లో అంటే.. పారితోషికాల‌న్నీ మిన‌హాయించుకుని రూ.10 కోట్ల‌లోపు సినిమా పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న‌లో నిర్మాత ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాళ్ల‌కు జాలీ ఎల్ ఎల్ బీ ఓ ఆప్ష‌న్ మాత్ర‌మే. అంత‌కంటే మంచి క‌థ దొరికితే.. ఈ రీమేక్ ప‌క్క‌కెళ్లిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close