ఎలక్టోరల్ బాండ్ల నిధుల్లో టీఆర్ఎస్, వైసీపీ దూకుడు !

అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలివ్వడానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు. బీజేపీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకు వచ్చింది. దీని ప్రకారం ఎవరు ఇస్తున్నారో తెలియకపోయినా ఎన్ని కోట్లయినా విరాళాలు తీసుకోవచ్చు. సహజంగానే బీజేపీకి అందరూ ఇస్తారు. అయితే ప్రాంతీయపార్టీల్లో బీజేపీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక మొత్తం అందుకుంటున్న పార్టీ టీఆర్ఎస్. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని విరాళాల రూపంలో పొందింది టీఆర్ఎస్.

ఇక ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం దక్కింది. రెండో స్థానంలో శివసేన ఉంది. ఈ పార్టీకి రూ. 111.403కోట్ల విరాళాలొచ్చాయి. మూడో స్థానంలో వైసీపీ ఉంది.. ఈ పార్టీకి రూ. 92.739కోట్లు విరాళాలొచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్, డీఎంకే సహా 14 ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 447.49కోట్లు విరాళాలు అందాయి. 42 పార్టీల్లో 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టాయి.

ఆదాయం వస్తోంది కానీ టీఆర్ఎస్ అసలు ఖర్చు చేయడం లేదు. మొత్తం ఆదాయంలో పదిహేనుశాతం కూడా ఖర్చు చేయడం లేదు. మిగతా అంతా మిగులులోనే ఉంది. అధికార పార్టీలు అన్నీ అంతే. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు మాత్రం విరాళాలు తగ్గిపోతున్నాయి… ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేసి తెలుగు దేశం పార్టీ లోటులోకి వెళ్లిపోయింది. నిన్నామొన్నటి వరకూ ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పరిస్థితి కూడా అంతే ఒక్క బీజేడీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆదాయానికి మించి ఖర్చుల్లోనే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close