గ్రేటర్ ఎగ్టిట్‌ పోల్స్‌లో కారుదే హవా..!

గ్రేటర్ ఎన్నిల్లో ఎగ్జిట్స్ పోల్స్ అంచనా ప్రకారం… తెలంగాణ రాష్ట్ర సమితికే మెజార్టీ స్థానాలు దక్కనున్నాయి. వివిధ సర్వేలు.. టీఆర్ఎస్‌కే అత్యధిక స్థానాలు కట్టబెట్టాయి. పీపుల్స్ పల్స్ అనే సంస్థ విడుదల చేసిన సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్‌ 68 నుంచి 78 డివిజన్లలో గెలవొచ్చు. 38 శాతం ఓట్లు టీఆర్ఎస్‌కు లభిస్తాయి. రెండో స్థానం ఎంఐఎంకు లభిస్తుంది. ఎంఐఎంకు 38 నుంచి 42 వరకూ పదమూడు శాతం ఓటు షేర్‌తో వస్తాయి. బీజేపీకి 32 శాతం ఓటు షేర్ లభించినప్పటికీ.. సీట్లు 25 నుంచి 35 మధ్య ఉంటాయని అంచనా వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. పన్నెండు శాతం ఓట్లతో .. ఒకటి లేదా రెండు సీట్లు రావొచ్చని చెబుతున్నారు. ఇతరులు- 5 శాతం ఓట్‌లు సాధించినా.. వారికేమీ సీట్లు రాకపోవచ్చని తేల్చారు.

ఆరా అనే మరో సంస్థ జరిపిన సర్వేలో.. టీఆర్ఎస్‌కు 101 సీట్లు రావొచ్చని అంచనా వేశారు. 46 శాతం ఓట్లు వస్తాయి. బీజేపీకి ఇరవై ఆరు శాతం ఓట్లతో.. ఐదు నుంచి పననెండు సీట్లు రావొచ్చని తెలిపారు. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అనే సంస్థ చేసిన సర్వేలో.. టీఆర్ఎస్‌కి 85కిపైగాసీట్లు లభిస్తాయి. హెచ్ఎంఆర్ అనే సంస్థ చేసిన సర్వేలో టీఆర్ఎస్‌కు 70 సీట్లు అంచనా వేశారు. జన్‌కీ బాతక్ సర్వేలో 74 సీట్లు వస్తాయన్నారు. మొత్తంగా.. ఓవరాల్‌గా చూసుకుంటే.. టీఆర్ఎస్‌కు మేజిక్ మార్క్‌ అయిన 75 చేరుకుంటుందని బీజేపీకి ఓట్ల శాతం బాగా పెరిగినా.. సీట్ల దగ్గర చాలా పరిమితంగా వస్తాయని లెక్కలేశారు.

ఈ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ… దుబ్బాక విషయంలో తేలిపోయాయి. చాలా సంస్థలు… టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని లెక్కలేశాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం.. బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. సొంత అభిమానంతో లెక్కలేసే సర్వే సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. కింది స్థాయిలో పని చేసే వారు లేకపోయినా…ఆఫీసుల్లో కూర్చుని కాకి లెక్కలేసే పోల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. లక్కీగా తాము అంచనా వేసిన దగ్గర పలితాలు వస్తే జబ్బలు చరుచుకుంటారు. లేకపోతే..,. సైలెంటయి.. మళ్లీ ఎన్నికలొచ్చేటప్పటికీ.. తెరమీదకు వస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close