టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెరిగిన “పీడ దినాలు”.. ! వచ్చే నెలే కేబినెట్ విస్తరణ..?

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు “పీడ దినాలు” వెంటాడుతున్నాయి. సంక్రాంతి తర్వాత మంచి దినాలు వస్తాయనుకుంటే.. అవి ఫిబ్రవరికి పొడిగింపు అయ్యాయి. డిసెంబర్ పదకొండో తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ముఖ్యమంత్రిగా రెండో సారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. మరో మంత్రిగా ప్రమాణం చేసిన మహబూద్ అలీ.. హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దాదాపుగా ఇరవై రోజులుగా.. ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి .. మరో మంత్రి ద్వారానే నడుస్తోంది. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారనే.. ఆశతో.. మంత్రి పదవులపై ఆశలున్న నేతలు… తమ వంతుగా కేసీఆర్‌ను.. కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా దూకుడు చూపిస్తున్నారు.

తీరా ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రి పదవుల ఆశావహులకు.. కొత్తగా.. పీడదినాలు… పంచాయతీ ఎన్నికల రూపంలో వచ్చాయి. జనవరి ఒకటో తేదీనే.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. మూడు విడతలుగా.. పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కచ్చితంగా జనవరి 30వ తేదీన ముగుస్తాయి. 90 శాతం పంచాయతీల్లో గులాబీ జెండా ఎగరాల్సిందేనని పట్టుదలగా ఉన్న టీఆర్ఎస్ అధినేత.. ఆ బాధ్యత అంతా ఎమ్మెల్యేల మీదే పెట్టారు. సహజంగానే.. ఈ ఎన్నికల్లో వారి పనితీరు మంత్రి పదవుల పంపకంలో ప్రామాణికం అవుతుంది. ఈ కారణంగానే… మంత్రి వర్గ విస్తరణ ఈ నెలలో జరిగే అవకాశం లేదని.. ప్రగతి భవన్ నుంచి మీడియా ప్రతినిధులకు..లీకులు వచ్చాయి.

నిజానికి కేసీఆర్.. ముందు నుంచీ.. పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయడం లేదని.. ఆరేడుగురు మంత్రులకు మాత్రమే చాన్సిస్తారని ప్రచారం జరుగుతోంది. మిగతా విస్తరణ పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు.. ఈ ఆరేడుగురికి కూడా.. ఫిబ్రవరి వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి. మంత్రులు ఉన్నా.. లేకపోయినా.. పాలనలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో.. ప్రజలు కూడా.. మంత్రివర్గం ఉందా లేదా అన్న అంశంపై ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు… టీఆర్ఎస్‌లో వ్యక్తమవుతున్నాయి. అందుకే.. పీడ దినాలు.. ఇప్పటికే నెలాఖరు వరకు ఉంటాయి.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల వరకూ సాగుతాయా.. లేదా అన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి అంచనా వేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close