ఢిల్లీ బీజేపీని రెచ్చగొడుతున్న టీఆర్ఎస్ ! ఏం కోరుకుంటున్నారు ?

తెలంగాణ బీజేపీ నేతల విషయంలో నిర్మోహమాటంగా పోలీస్ ఫోర్స్‌ను ప్రయోగించేసిన టీఆర్ఎస్ .. ఇప్పుడు ఢిల్లీ బీజేపీపైనా అదే దూకుడు చూపిస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా కార్యక్రమాలు చేపట్టేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన… టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి టీఆర్ఎస్ ఇచ్చిన కౌంటర్లు చాలా నాటుగా ఉన్నాయి. నడ్డాపై అత్యంత దారుణమైన భాషను ఉపయోగించారు. ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు.. ఇతర నేతలూ అదే దారి పట్టారు. జీవన్ రెడ్డి అనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే.. నడ్డా.. ఇది మా అడ్డా.. ఉరికించి కొడతామని హెచ్చరించారు.

కేటీఆర్..నడ్డాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎంత ఓవర్‌గా ఎందుకు రియాక్ట్ అవుతుందో బీజేపీ నేతలకైనా క్లారిటీ ఉందో లేదో కానీ.. టీఆర్ఎస్ నేతల్లో మాత్రం కాస్త ఆందోళన కనిపిస్తోంది. కేంద్ర బీజేపీని రెచ్చొగట్టే వ్యూహాన్ని టీఆర్ఎస్ అగ్రనాయకత్వం చేస్తోందని అంటున్నారు . ఢిల్లీ బీజేపీపై విమర్శలు చేసే ప్రతీ సారి అటు కేసీఆర్ అయినా.. ఇటు కేటీఆర్ అయినా కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రస్తావన తెస్తూంటారు. విమర్శిస్తే వాటితో దాడులు చేయిస్తూంటారని విమర్శిస్తూంటారు. బుధవారం కూడా కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ దర్యాప్తు సంస్థలు బీజేపీ మిత్రపక్షాలని విమర్శించారు.

బీజేపీపై టీఆర్ఎస్‌కు ఇంత దూకుడు వెనుక ఆ దర్యాప్తు సంస్థలుతమపై దాడులు చేస్తే.. ప్రజల్లో సానుభూతి పొందాలన్న వ్యూహం అయినా ఉండి ఉండాలి లేకపోతే ఇప్పటికే అలాంటి దాడులకు కేంద్రం.. బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తే మైండ్ గేమ్‌తో ఆపేందుకు ప్రయత్నించే వ్యూహం అయినా అమలు చేస్తూ ఉండాలన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. లేకపోతే పెద్దగా సీరియస్‌నెస్ లేని విషయాలను అతి పెద్ద అంశంగా ప్రొజెక్ట్ చేయడమే కాదు.. అధికారాన్ని కూడా ప్రయోగించాల్సిన అవసరం ఏముందుంటున్నారు ? అదే అధికారం కేంద్రంలో బీజేపీ వద్ద కూడా ఉందనే సంగతిని టీఆర్ఎస్ ఎందుకు మర్చిపోతుందని ప్రశ్నిస్తున్నారు ? . మొత్తంగా టీఆర్ఎస్ మాత్రం బీజేపీ ఏదో ఓ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close