రేపే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక: ఇద్దరు డిప్యూటీలు?

హైదరాబాద్: సంచలనం సృష్టించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చివరి అంకం… మేయర్ ఎన్నిక రేపు జరుగనుంది. కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం, మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాలును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కొత్త కుర్చీలను, మైకులు, లైట్లు, ఏసీని సిద్ధం చేశారు. 150 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు 67 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు మేయర్ ఎన్నికలో పాల్గొంటారు. మొత్తం ఎన్నికలో పాల్గొనే సభ్యుల సంఖ్య 217 కావటంతో మేయర్ ఎన్నికకోసం 108 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే 99 మంది సభ్యులు గెలుచుకోవటం, గణనీయ సంఖ్యలో ఎక్స్ అఫిషియో సభ్యుల బలం ఉండటంతో ఆ పార్టీ వారే నామినేటెడ్ పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవనున్నారు. మొన్నటివరకు ఎక్స్ అఫిషియో సభ్యులు కలుపుకుని టీఆర్ఎస్ బలం 133 కాగా, నిన్న టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చేరటంతో గులాబీ బలం 134కు పెరిగింది.

టీఆర్ఎస్‌లో మేయర్ పదవికి కేశవరావు కుమార్తె విజయలక్ష్మికి, కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా పేరుపడ్డ బొంతు రామ్మోహన్‌కు మధ్య ప్రస్తుతం పోటీ నెలకొని ఉంది. వీరిద్దరు మున్నూరు కాపు సామాజికవర్గం వారే కావటం విశేషం. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలు లేరు కాబట్టి మేయర్ పదవినైనా మహిళకు ఇస్తే ఆ లోటును భర్తీచేసినట్లుందని కేసీఆర్ భావిస్తున్నట్లు ఒక వాదన వినిపిస్తోంది. అయితే 26 సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చిన విజయలక్ష్మికి పౌరసత్వానికి సంబంధించి కొద్దిగా సమస్య ఉందంటున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ పదవిని ఇద్దరికి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. వీటిలో ఒక పదవిని ముస్లిమ్‌లకు, మరొకదానిని సీమాంధ్ర వాసులకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close