విహెచ్ ఆశ అడియాస..

రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి వున్న రెండవ స్థానానికి కాంగ్రెస్‌ ఎంపి వి.హనుమంతరావును పంపించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ సహకరించే అవకాశాలున్నాయంటూ వస్తున్న కథనాలు వూహాగానాలే.  టిఆర్‌ఎస్‌పై రోజూ కత్తులు నూరుతున్న కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడుగా చెప్పుకునే వ్యక్తిని కోరి కోరి రాజ్యసభకు పంపించదు. విహెచ్‌పట్ల సోనియాగాంధీకి అభిమానం వుండొచ్చు గాని కెసిఆర్‌కు వుండాల్సిన అవసరం లేదు. తెలంగాణ సాధనలో ఆయన గొప్పపాత్ర వహించినట్టు టిఆర్‌ఎస్‌ చెప్పిందీ లేదు. సోనియా గాందీ స్వయంగా కోరితే కెసిఆర్‌ పరిశీలించవచ్చునేమో గాని అది జరిగేపని కాదు. గతంలో శాసనసభ ఎన్నికల సమయంలోనే బయిటపడని మేడమ్‌ విహెచ్‌ కోసం అంత దిగివస్తారని భావించలేము. తెలుగుదేశంను పూర్తిగా జీర్ణంచేసుకున్నాక టిఆర్‌ఎస్‌ ఇప్పుడు కాంగ్రెస్‌నే పోటీదారుగా భావిస్తున్నది గనక ఆ పార్టీకే రాజ్యసభ స్థానం కట్టబెట్టి ఒక విమర్శకుణ్ని తెచ్చిపెట్టుకోదు. ఏతావాతా విహెచ్‌ ఇంటిదారి పట్టడం అనివార్యం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close