మనిషికి 1200 డాలర్లు..! ట్రంప్ కరోనా ప్యాకేజీ..!

అమెరికాలో కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల నష్టపోయిన వారందరికీ ట్రంప్ సాయం చేయబోతున్నారు. పెద్దవాళ్లకు 1200 డాలర్లు సాయం అందించనున్నారు. పెరుగుతున్న డాలర్ విలువను దృష్టిలో పెట్టుకుంటే.. అటూ ఇటుగా మన రూపాయల్లో లక్ష. నేరుగా నగదు బదిలీ ద్వారా అమెరికన్ పౌరులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయం ప్రకటించారు. పెద్దవాళ్లకే కాదు.. చిన్న పిల్లలకు కూడా ఈ ప్యాకేజీలో భాగం ఉంది. చిన్న పిల్లలకు 500 డాలర్లను అందించబోతున్నారు. కరోనా వైరస్ కారణంగా.. ఎమ‌ర్జెన్సీ ప్రకటించడంతో పాటు.. వివిధ రకాలుగా ఏర్పడిన నష్టాన్ని తట్టుకోవడానికి.. రెండు ట్రిలియన్ డాలర్లు ఆర్థిక ప్యాకేజీకి అమెరికా సెసెన్ ఆమోదం తెలిపింది. రెండు ట్రిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 150 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు.

అమెరికాను షట్ డౌన్ చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా లేరు. కానీ.. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితుల్ని అమలు చేస్తున్నారు. ఉత్పత్తికి గండి పడింది. ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. ప్రతి ఒక్కరి ఉపాధి, వ్యాపారానికి ఇబ్బంది ఏర్పడటంతో తక్షణం వారందర్నీ ఆదుకోకపోతే.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని.. ట్రంప్ ఆందోలన చెందుతున్నారు. అందుకే.. కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆర్థిక ప్యాకేజీకి సెనెట్‌లో ఆమోద ముద్ర వేయించుకోగలిగారు. ప్యాకేజీలో కేటాయించిన నిధుల్లో 367 బిలియన్ డాలర్లు చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేటాయించారు. ఉద్యోగులు ఇంటికే పరిమితయ్యారు. వారందరికీ.. ఇబ్బందులు లేకుండా జీతాలు చెల్లించేందుకు ఈ మొత్తం వెచ్చిస్తారు.

ఇక బడా వ్యాపార సంస్థలకూ భారీ సాయం ప్రకటించారు. 500 బిలియన్ డాలర్లు.. గ్యారంటీలకు.. సబ్సిడీలకు కేటాయించారు. అత్యధికంగా హాస్పిటల్స్‌కు నిధులు అందించబోతున్నారు. ఎక్కడివక్కడ ఆగిపోయిన ఎయిర్‌లైన్స్ సంస్థలకూ సాయం చేయబోతున్నారు. అమెరికా చరిత్రలో ఇంత భారీ ఆర్థిక ప్యాకేజీని ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ ప్యాకేజీలో ప్రధానమైన అంశం… పౌరులకు నేరుగా నగదు అందబోతూండటం…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close