చైనా టూర్: సీఎమ్‌ది అయ్యింది, ఇప్పుడు వీళ్ళ వంతు!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బృందంతో ఛార్టర్డ్ ఫ్లైట్‌లో చైనా వెళ్ళి పదిరోజులు పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు దఫ దఫాలుగా చైనా వెళ్ళబోతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఈ ‘స్టడీ ట్రిప్‌’లను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు. పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలలో చైనా అనుసరించే విధానాలను ఈ బృందాలు అధ్యయనం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. వచ్చేవారంలో మొదటి విడతలో ఒక బృందం బయలుదేరబోతోంది. ప్రభుత్వంలో, పరిపాలనలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతిఒక్కరూ చైనాను సందర్శించి వారు అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని, తెలంగాణలో వాటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను చైనాలోని బీజింగ్ తదితర నగరాల తరహాలో అభివృద్ధి చేయాలని కేసీఆర్ ఆశిస్తున్నారట.

కేసీఆర్ బృందం తమ చైనా పర్యటనకు రు.2 కోట్లతో లగ్జరీ ఛార్టర్డ్ ఫ్లైట్ మాట్లాడుకుని వెళ్ళటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు మంత్రులు, ఎంపీలు, తదితరులు ఇలా విడతలు, విడతలుగా చైనా బయలుదేరటం మరిన్ని విమర్శలకు తావిచ్చేలా ఉంది. దానికితోడు తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ నిధులకొరతతో అల్లాడుతుండగా, మరోవైపు రైతుల ఆత్మహత్యలు తీవ్రంగా పెరిగిపోతుండగా ప్రభుత్వంలోని ముఖ్యులందరూ ఇలా పొలోమని చైనాకెళ్ళటం ఎంతవరకు సబబనే వాదనకూడా వినబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close