అనసూయ ఇంటర్వ్యూ

టీవీ యాంకర్ అనసూయ చాలా తక్కువ సమయంలోనే తన నటన, వాక్చాతుర్యం, అందంతో ప్రజలను ఆకట్టుకొన్నారు. ఆమె ప్రతిభను చూసి మొదట్లోనే కొందరు నిర్మాతలు ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చేరు కానీ ఇంతకాలం ఆమె అంగీకరించలేదు. చివరికి ఆమె కూడా సినీమాలలోకి ప్రవేశించారు. ఆమె మొట్టమొదటి చిత్రం క్షణం. అదింకా విడుదల కాకముందే ఆమె నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయినా’ విడుదలవడంతో అదే ఆమె మొదటి చిత్రమయింది. త్వరలోనే క్షణం సినిమా కూడా విడుదల కాబోతోంది. ఆమే తన మొదటి సినిమాలోనే ఒక పోలీస్ ఉన్నతాధికారి (ఎసిపి) పాత్రలో నటించడం విశేషం.

“నన్ను సినిమాలలోకి ఎందుకు తీసుకొన్నారో తెలుసు. కనుక నా మొట్టమొదటి సినిమాలో దర్శకుడు నన్ను చాలా గ్లామరస్ గా ప్రెజంట్ చేస్తారని అనుకొన్నాను. కానీ మొదటి సినిమాలోనే నాచేత ఎసిపి వంటి గంభీరమయిన పాత్ర వేయించారు.,” అని ఆమె అన్నారు.

క్షణం సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ “నేను ఎసిపి పాత్రలో నటించినప్పటికీ ఖాకీ డ్రెస్ వేసుకోకుండానే సినిమా పూర్తి చేసేశాను. నా డ్రెస్, పెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నాను. ఎందుకంటే మహిళా పోలీస్ అధికారి పాత్ర అనగానే అందరికీ విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా, అందులో ఆమె పాత్రే గుర్తుకు వస్తుంది. కానీ నేను ఆ సినిమాను చూడలేదు. ఆమెను అనుకరించాలనుకోలేదు. నాకు వచ్చినట్లు నటించాను. ఇంతకాలం యాంకర్ గా నన్ను చూసిన ప్రజలు ఇప్పుడు ఈ ఎసిపి పాత్రలో ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి. నా నటన ప్రేకషకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.”

క్షణం సినిమాలో అడవి శేషు, ఆదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. రవికాంత్ పెరేపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాఫిబ్రవరి 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చాలా ఆసక్తికరమయిన విషయాలు చెప్పారు.

“నా సినిమా జీవితం వేరు.. వ్యక్తిగతం జీవితం వేరు. నేను ఇద్దరు పిల్లల తల్లిని. దానితో నా నటనకు ముడి పెట్టవద్దు. ఒక నటిగా నా నుండి మీరు ఏమి ఆశిస్తున్నారో అది నేను ఇవ్వగాలుగుతున్నానో లేదా అనే విషయం మాత్రం చూడండి. సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చెను కనుక ఏమి చేసాను అనే దానికంటే ఎలాగా చేసాను అనే డానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను నా జీవితంలో దేనినీ ముందుగా ప్లాన్ చేసుకోలేదు. టీవీ రంగంలోకి ఎలాగ వచ్చి పడ్డానో అలాగే సినీ పరిశ్రమలోకి కూడా వచ్చేసాను. టీవీ రంగంలో ఏవిధంగా కష్టపడి పైకి వచ్చానో సినీ పరిశ్రమలో కూడా అలాగే కష్టపడతాను. ఫలితం మాత్రం ఆశించను. క్షణం సినిమా తరువాత సినిమాలు చేయాలనుకొంటున్నాను. సినిమాలు చేస్తూనే, నాకు ఈ స్థాయికి చేర్చిన టీవీ రంగంలో కూడా యధావిధిగా పనిచేయలనుకొంటున్నాను,” అని అనసూయ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close