మీడియా వాచ్ : కరోనాతో తెలుగు రిపోర్టర్ మృతి..!

తెలుగు మీడియాలో కరోనా వైరస్ సోకి ఓ రిపోర్టర్ మరణించారు. టీవీ5లో క్రైమ్ రిపోర్టింగ్ చేస్తున్న మనోజ్ అనే జర్నలిస్టు.. వైరస్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురై.. చికిత్స పొందుతూ మరణించారు. ఇది తెలుగు జర్నలిస్టు సర్కిళ్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపుగా పదిహేనేళ్లుగా మనోజ్.. జర్నలిస్టుగా పని చేస్తన్నారు. మనోజ్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని చాలా ఆలస్యంగా తెలిసింది. అయితే.. చనిపోయేంత తీవ్రంగా ఉందని మాత్రం గుర్తించలేకపోయారు. ఇతరత్రా పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకపోయినా.. కరోనా తీవ్రమైన ప్రభావం చూపడంతో.. ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఇప్పటి వరకూ తెలుగు మీడియాలో పెద్దగా కరోనా కేసులు బయటపడలేదు. మూడు రోజుల కిందట.. సాక్షిలో ఓ రిపోర్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ జర్నలిస్టు సర్కిళ్లలో బయటపడిన మొదటి పాజిటివ్ కేసు అదే అనుకున్నారు. కానీ.. పలువురికి ఇది సోకిందని.టీవీ5 క్రైమ్ జర్నలిస్ట్ మృతితో భావిస్తున్నారు. కరోనా రిపోర్టింగ్‌లో జర్నలిస్టులు చాలా దూకుడుగా వ్యవహరించారు. ఇప్పుడు వారంతా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి.

ఢిల్లీలోనూ.. కొంత మంది తెలుగు జర్నలిస్టులకు.. వైరస్ సోకింది. అయితే.. వారందరూ చాలా వేగంగా కోలుకున్నారు. వైరస్.. యువకులు తట్టుకునేలా ఉంటుందని.. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వారికి ఇబ్బంది లేదని విశ్లేషణలు వస్తున్నాయి కానీ.. అది ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా.. మరణాలు సంభవిస్తున్నాయి. టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మరణం మాత్రం.. తెలుగు జర్నలిస్టు సర్కిళ్లను ఒక్క సారిగా షాక్‌కు గురి చేసిందని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close