తెలుగులో నెంబర్ వన్ హోదా కోల్పోయిన టీవీ9 !

తెలుగు న్యూస్ చానళ్లలో టీవీ9 తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఎన్టీవ మొదటి స్థానానికి వచ్చింది. చాలా కాలం విరామం తర్వాత బార్క్ టీవీ చానళ్ల రేటింగ్స్‌ను ప్రకటించింది. వీటిని చూసిన టీవీ9 యాజమాన్యానికి మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. ఈ ఏడాది పదో వారం రేటింగ్స్ ను చూస్తే ఓవరాల్‌గా 77 పాయింట్లతో ఎన్టీవీ అగ్రస్థానంలో ఉంది. టీవీ స్థానం రెండో స్థానానికి పడిపోయింది. అది కూడా దరి దాపుల్లో లేదు. కేవలం యాభై ఐదు పాయింట్లు మాత్రమే టీవీ9 సాధించింది. అంటే మొదటి స్థానానికి మధ్య ఇరవై రెండు పాయింట్ల తేడా ఉంది. మూడో స్థానంలో తెలంగాణ చానల్ వీ6 నిలిచింది. టీవీ 5, ఏబీఎన్ , సాక్షి, ఇతర టీవీ చానళ్లు 15 నుంచి ౩0 మధ్య రేటింగ్‌లు సాధిస్తూ ఉనికి నిలుపుకున్నాయి. అర్బన్ , రూరల్ ప్రాంతాల్లోనూ ఎన్టీవీదే ఆధిపత్యం కనిపిస్తోంది.

టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్ చేతుల నుంచి ఇతరులకు అప్పగించిన తర్వాత ఆ చానల్ ఇమేజ్ దారుణంగా పడిపోతూ వస్తోంది. బయాస్ న్యూస్‌కు ప్రతిరూపం అనే విమర్శలు ఎదుర్కోంటోంది. అదేసమయంలో అధికార రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఇతరులపై తప్పుడు ప్రచారానికి కూడా వెనుకాడని వైనం టీవీ 9 ఇమేజ్‌ను మరింత దిగజార్చిందని అనుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇటుక ఇటుక పేర్చుకుటూ వచ్చిన ఇమేజ్…రియల్ ఎస్టేట్ యాజమానులైన… కొత్త యాజమాన్యం స్వార్థానికి కరిగిపోవడం ప్రారంభించింది.

నిజానికి ఎన్టీవీ కూడా ఆ తాను ముక్కే. అందులోనూ టీవీ9 పెట్టుబడిదారుల డబ్బులున్నాయి.అయితే ఆ చానల్ యజమాన్యం కాస్తయినా జర్నలిజం ప్రమాణాలను పాటించే ప్రయత్నం చేస్తోంది. టీవీ9లా పూర్తి స్థాయిలో దిగజారిపోలేదు. అందుకే టీవీ9 కన్నా ఎన్టీవీ బెటర్ అన్నట్లుగా పరిస్తితి మారింది. న్యూస్ చానళ్ల రేటింగ్‌లు చాలా కాలంగాఇవ్వడం లేదు. తప్పుడు రేటింగ్‌ల కోసం చానళ్లు అక్రమాలకు పాల్పడినట్లుగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో టీవీ9 కూడా ఉంది. ఈ క్రమంలో రేటింగ్‌లు దారుణంగా పడిపోవడం.. ఆ చానల్ ఇమేజ్‌కు మరింత దెబ్బే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close