మీడియా వాచ్: బోగస్ వార్తలు టీవీ9 మళ్ళీ మొదలెట్టిందా?

ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాలలో టీవీ9 నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే అగ్రస్థానంలో లో ఉన్న ఛానల్ మిగిలిన అందరి కంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలు భావిస్తారు. కానీ టీవీ9 లో వస్తున్న కొన్ని వార్తలు చూస్తుంటే మళ్లీ బోగస్ వార్తలను టీవీ9 మొదలెట్టిందా అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. వివరాల్లోకి వెళితే..

“పవన్ కళ్యాణ్ రెండు నాలుకల ధోరణితో మాట్లాడడం మానేయాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ ను రాయలసీమలో తిరగనివ్వం – ఇట్లు విద్యార్థి సంఘాలు”

ఇదీ ఇవాళ టీవీ9 చాలాసేపు స్క్రోలింగ్ ఇచ్చిన వార్త. అయితే ఈ వార్త చదవగానే ప్రజలకు కలిగిన అనుమానం ఏమిటంటే, అసలు ఏ విద్యార్థి సంఘాలు పవన్ కళ్యాణ్ కు ఈ తరహా అల్టిమేటం జారీ చేశారు, నిజంగా ఏ విద్యార్థి సంఘం అయినా ఈ తరహా హెచ్చరిక జారీ చేసి ఉంటే దాని వీడియో ఎందుకని టీవీ9 ప్రసారం చేయలేదు, పోనీ, వీడియో ప్రసారం చేయకపోయినా, కనీసం ఆ విద్యార్థి సంఘానికి ఒక పేరు ఉంటుంది కదా ఆ పేరైనా ఎందుకని ప్రసారం చేయలేదు – ఇవీ ప్రజల్లో కలిగిన అనుమానాలు. ఈ స్క్రోలింగ్ వార్త చూసిన చాలా మందికి కలిగిన అనుమానం ఏమిటంటే, అధికార పార్టీకి సంబంధించిన ఎవరైనా రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు, సదరు ఛానల్ ఈ తరహా వార్త వండి వార్చిందేమో అన్నదే ఆ అనుమానం. గతంలో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు చిరంజీవి మీద కేసులు పెట్టారంటూ టీవీ9 లో వచ్చిన వార్తలు ఏ విధంగా వండారో ఇటీవల ఒక జర్నలిస్ట్ కూలంకషంగా వివరించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అటువంటివి మానేసిన టీవీ9 మళ్లీ ఇప్పుడు అదే తరహా వార్తలకు తెరతీసిందేమో అన్న అనుమానం ఈరోజు ప్రసారం చేసిన వార్తల తర్వాత కలుగుతోంది.

ఏది ఏమైనా మిగతా చానల్స్ తో పోలిస్తే కాస్త విశ్వసనీయత ఉన్న ఛానల్ గా పేరుగాంచిన టీవీ9 ఇలాంటి ఆకాశ రామన్న సంఘాల పేరిట వచ్చే వార్తలను ప్రముఖంగా ప్రసారం చేయడం తగ్గించి, వీడియో ఆధారాలు ఉన్న వార్తలను ప్రసారం చేస్తే ఆ ఛానల్ పై మరింత విశ్వసనీయత కలిగే అవకాశం ఉంది అన్న అభిప్రాయం ప్రజల నుండి వెలువడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close