ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం 15 మంది మృతి

ప్రకాశం జిల్లాలోని కందుకూరు మండలం చెర్లోపాళెం వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుట్లూరు మండలంలోని చేవూరు నుంచి మాలకొండ వెళుతున్న డి.సి.ఎం. వ్యాన్ ఎదురుగా వస్తున్న శ్రీ కృష్ణ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సుని డ్డీ కొనడంతో రెండు వాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడ్డాయి. విచిత్రం ఏమిటంటే బస్సులో డ్రైవర్ మినహా ప్రయాణికులెవరూ లేరు కానీ డి.సి.ఎం. వ్యాన్‌లో 40 మంది పెళ్లి బృందం ప్రయాణిస్తున్నారు. వారిలో 12 మంది అక్కడే మరణించగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారికి కూడా గాయలయినప్పటికీ వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. రెండు వాహనాలు కాలువలో పడినపుడు బస్సుకి మంటలు అంటుకొని దగ్ధమయిపోయింది. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు, అధికారులు సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకొని గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సరకు రవాణా చేసే వాహనాలలో జనాన్ని తరలించటం తప్పని ఒక వాదన వినబడుతుండగా, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సును క్లీనర్ నడుపుతుండటంవల్లే ప్రమాదం జరిగిందని డీసీఎమ్‌లోని పెళ్ళిబృందంవారు ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close