మరో ఇద్దరు ఏపీ “సిన్సియర్ ఐఏఎస్, ఐపీఎస్‌”లకు జైలు శిక్ష !

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ కృష్ణ బాబు , ఐపిఎస్ ద్వారకా తిరుమలరావు లకు నెల రోజులు జైలు శిక్ష,1000/- జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. 16వ తేదీ లోగా రిజిస్ట్రార్ జ్యూడిషియల్ ముందు లొంగిపోవాలని వారిద్దరినీ ఆదేశించింది. వీరిని శిక్ష అనుభవించేందుకు వెంటనే జైలు కు పంపాలని రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. వీరితో పాటు మరో ముగ్గురు ఆర్టీసీ అధికారులకూ శిక్ష విధించింది. తమ సర్వీసును క్రమబద్దీకరించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వారి సర్వీస్‌ను క్రమబద్దీకరించాలని వారి జీతాలకు ఏడు శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశించింది. 2022 ఆగస్టులోనే హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం చెల్లించలేదు. సర్వీసును క్రమబద్దీకరించలేదు. దీంతో ఆ ఉద్యోగులుధిక్కరణ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారుల తీరుపై మంమడిపడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు తీర్పును ఉల్లంఘించారని స్పష్టం చేసింది. అయితే తాము ఈ తీర్పును అప్పీల్ చేశామని.. ఆర్టీసీ లాయర్లు హైకోర్టులో వాదించారు. కానీ స్టే రాలేదు కదా.. అలాంటప్పుడు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు మండిపడింది. జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

ఎంటీ కృష్ణ బాబు, ద్వారకా తిరు్మల రావు సిన్సియర్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ వారిపై ఎలాంటి రిమార్కులు లేవు. అయితే ఇప్పుడు ఏకంగా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు.. కోర్టు తీర్పును ఉల్లంఘిచినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. అప్పీల్ చేసి శిక్ష ను తగ్గించుకుంటారో లేకపోతే స్టే తెచ్చుకుంటారో లేదో కానీ.. ఇలా వారి కెరీర్‌లో మాత్రం ఈ మచ్చ అలా ఉండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close